దళితుడిపై ఎస్సై దాడి…, సస్పెండ్ చేయాలని డిమాండ్..

బాహు బలంన్యూస్ సైదాపూర్,ప్రతినిధి మే 17: సైదాపూర్ శిక్షణ ఎస్సై భార్గవ్ ఒక దళిత యువకుడిని దారుణంగా చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో బాధితుడు బత్తుల మహేందర్ చెవిటివాడిగా మారడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తిప్పారపు సంపత్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్, బాధితుడు మహేందర్‌ను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ,ఎస్సై భార్గవ్ ఒక అమాయక దళితుడిపై సైకోలా ప్రవర్తించాడని తీవ్రంగా ఖండించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా, బైక్‌పై వెళ్తున్న మహేందర్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతున్నా డని, ఆగ్రహించిన ఎస్సై భార్గవ్,”నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ మాట్లాడుతావా రా” అంటూ విపరీతంగా కొట్టాడని సంపత్ తెలిపారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆకాష్ రెడ్డి కూడా “మా సార్‌కు గౌరవం ఇవ్వవా రా” అంటూ లాఠీతో మహేందర్ వీపుపై కొట్టడం మొదలుపెట్టాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు ఎస్సై భార్గవ్ తన సిబ్బందితో కలిసి మహేందర్‌ను కొట్టారని, బూతులు తిడుతూ కులంపేరుతో దూషించారని సంపత్ ఆరోపించారు. అంతేకాకుండా, బాధితుడిని బెదిరించి తనదే తప్పని ఒక లేఖ రాయించుకున్నాడని ఆయన తెలిపారు.
మహేందర్‌ను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చగా, చెవుల నుండి విపరీతంగా రక్తం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో రెండు చెవుల కర్ణభేరీలు పగిలాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని, అయితే డబ్బులు లేకపోవడంతో ఆ దళిత కుటుంబం ఆవేదనతో ఇంటికి తిరిగి వచ్చిందని సంపత్ వివరించారు.
ఇలాంటి కీచక ఎస్సై దౌర్జన్యానికి ఒక దళిత యువకుడు బలికావడం చాలా బాధాకరమని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మరిచి రాక్షసుడిలా ప్రవర్తించిన ఎస్సై భార్గవ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని ఆయన కోరారు.ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కదిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !