శంకరపట్నంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై TJS, TDP ఆందోళన

bahubalamtv Reporter
bahubalamtv.in

శంకరపట్నంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై TJS, TDP ఆందోళన

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి
శంకరపట్నం, మే 18: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో సర్వే నెంబర్ 703లోని ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుండి కాపాడి, నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ TJS, TDP నాయకులు ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా TJS జిల్లా కన్వీనర్ మోరే గణేష్, TDP పార్లమెంట్ అడ్ హాక్ కమిటీ సభ్యులు మోరే ప్రభాకర్ మాట్లాడుతూ, మొలంగూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 703లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని గతంలో అనేక పోరాటాలు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించినా, హద్దులు నిర్ణయించడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, మే 20, 2025లోపు హద్దులు నిర్ణయించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో TJS, TDP నాయకులు షాబీర్, వీరమల్లు, శ్యామ్, సాగర్, శివస్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !