కాట్రపల్లి లో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అక్రమాలు, కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం

బాహుబలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 26:
హుజురాబాద్ మండలం,కాట్రపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. అర్హులైన పేదలను విస్మరించి, అనర్హులకు ఇళ్లు కేటాయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులే ఈ అవినీతికి పాల్పడ్డారని,ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి,భూములున్న,వారికి, గ్రామంలో రెండు బూతులు ఉంటే ఒక బూత్ లోని వారికే  ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేశారని గ్రామస్తులు మండిపడు తున్నారు. ఇంకో బూత్ లోని ప్రజలను,శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న పేదలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ నాయకుల అనుచరులకు ప్రాధాన్యం: ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా,గ్రామ శాఖ అధ్యక్షుడి భార్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ భార్య ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా ఉండటం గమనార్హం. “కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇల్లు లేని నిరుపేదల పొట్ట కొడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లతో సంబంధం లేకుండా ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుంటున్న  వారికి, ఎకరాల భూములున్న వారికి ఇళ్లు కేటాయిస్తున్నారు. గుంట భూమి కూడా లేని పేదలను పట్టించుకోవడం లేదు” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కమిటీ సభ్యుల వివరణ,

 గ్రామస్తుల అసంతృప్తి:
కమిటీ సభ్యులు మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. “పై అధికారుల నుండి వచ్చిన జాబితా ప్రకారమే ఇళ్లు కేటాయిస్తున్నాము” అని వారు చెబుతున్నారు. అయితే, ఈ వివరణతో గ్రామస్తులు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం, న్యాయం కోసం డిమాండ్:
ఈ వివాదం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మంటగలుపుతోంది. నాయకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు మండిపడుతున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఈ విషయంపై వెంటనే స్పందించి, న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిపై బీజేపీ భగ్గు.. హుజూరాబాద్‌లో క్యాండిల్‌ ర్యాలీ ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది.. మతం పేరుతో మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !