పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా హుజురాబాద్ వైద్యుల కొవ్వొత్తుల ర్యాలీ.

బాహు బలంన్యూస్ హుజురాబాద్,ప్రతినిధి ఏప్రిల్ 25: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో అమాయక హిందువులపై జరిగిన దారుణ దాడిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హుజురాబాద్ జమ్మికుంట ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ జమ్మికుంట ఐఎంఏ డాక్టర్లు ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. డాక్టర్లు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరవీరులకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఐఎంఏ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ అంకం సుధాకర్ మాట్లాడుతూ,అమాయక ప్రజలపై జరిగిన ఈ దాడి అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు.కార్యదర్శి డాక్టర్ ఉడుగుల సురేష్,మాట్లాడుతూ, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.డాక్టర్ డాక్టర్ బండి శృతి,మాట్లాడుతూ,బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ అంకం సుధాకర్, కోశాధికారి డాక్టర్ తొగరు విద్యా సాగర్,కార్యదర్శి డాక్టర్ ఉడుగుల సురేష్, వైద్యులు డాక్టర్ కృష్ణమూర్తి,డాక్టర్ నాగలింగం,డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ఎన్ రమేష్,డాక్టర్ బండి శృతి,డాక్టర్ కవిత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు.వైద్యులంతా ఒక్కతాటిపై నిలబడి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారని ఈ ర్యాలీ ద్వారా చాటి చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..