బాహు బలంన్యూస్ సైదాపూర్ ప్రతినిధి ఏప్రిల్ 27:
సైదాపూర్: సైదాపూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం కనులవిందుగా సాగింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకున్న తమ బాల్య స్నేహితులను చూసి పూర్వ విద్యార్థులు పరవశించిపోయారు.
8 నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న ఈ స్నేహితులు 39 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకే చోట చేరి, ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటూ ముచ్చటించుకున్నారు. తమ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి తమ పాఠశాల, ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ, విద్యా విధానం తమను జీవితంలో ఉన్నత స్థానాలకు చేర్చాయని వారు సంతోషంగా గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువుల గొప్పతనాన్ని కొనియాడారు. తమ విద్యాబుద్ధులకు మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులు కొత్త మల్లారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, తిరుపతయ్యలను ఘనంగా సత్కరించారు. వారికి పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించడం చూపరులను ఆకట్టుకుంది.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు చాడ వెంకట్ రెడ్డి, కాయిత రాములు, చందా రమేష్, మాడెపు రమేష్, లక్ష్మణ్, వర్ధరాజు, రవి, తిరుపతయ్య, సుధాకర్, జగన్నాథ రెడ్డి, సదయ్య తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కలయిక వారి మధ్య పూర్వపు అనుబంధాన్ని మరింత బలపరిచింది.
