బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 25: హుజురాబాద్ మండలం,చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సీ) ఆధ్వర్యం లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్క రించుకుని ఘనంగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో పిహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ మధుకర్,వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మధుకర్ మాట్లాడుతూ,మలేరియా వ్యాధి దోమ కాటు వల్ల వస్తుందని నివారణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవడం ద్వారా మరియు దోమల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని ఆయన సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, హుజూరాబాద్‌లో కూడా ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో డాక్టర్ జరీనా (మామిండ్ల వాడ) పాల్గొన్నారు
Post Views: 61