జేఈఈ మెయిన్స్‌లో హుజురాబాద్ విద్యార్థి సత్తా .. , కాంగ్రెస్ నేతల అభినందనలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ప్రతినిధి ఏప్రిల్ 23: ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇండియన్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో హుజురాబాద్‌కు చెందిన దేవంపల్లి గురుకుల కళాశాల విద్యార్థి రాచపల్లి ప్రదీప్ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. రవి కుమారుడైన ప్రదీప్ 92 శాతం మార్కు లు సాధించి తన సత్తాను చాటాడు.పేద కుటుంబానికి చెందిన ప్రదీప్ సాధించిన ఈ విజయం పట్ల హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు,హర్షం వ్యక్తం చేశారు. 13వ వార్డులోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ప్రదీప్‌ను ఆయన స్వయంగా కలిసి శాలువాతో సత్కరిం చారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ, పేదరి కంలో ఉన్నప్పటికీ పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రదీప్‌ను అభినందించారు.ప్రదీప్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరు పతి,పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడూరి స్వామి రెడ్డి, హనుమాన్ దేవస్థానం కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్,యూత్ కాంగ్రెస్ నాయకులు చల్లూరి విష్ణువర్ధన్, ముక్క రవితేజ తదితరులు పాల్గొన్నారు. వారందరూ ప్రదీప్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిపై బీజేపీ భగ్గు.. హుజూరాబాద్‌లో క్యాండిల్‌ ర్యాలీ ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది.. మతం పేరుతో మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిపై బీజేపీ భగ్గు.. హుజూరాబాద్‌లో క్యాండిల్‌ ర్యాలీ ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది.. మతం పేరుతో మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.