బాహు బలంన్యూస్ హన్మకొండ, ఏప్రిల్ 21:
వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్. నాగరాజును ఎల్కతుర్తిలో ఘనంగా సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శనిగరపు వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా శనిగరపు వెంకటేష్ మాట్లాడుతూ, కె.ఆర్. నాగరాజు నిజామాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి 2023 మార్చిలో పదవీ విరమణ అనంతరం రాజకీయాల పట్ల ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. 2023 శాసనసభ ఎన్నికల్లో వర్ధన్నపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్‌పై భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని ఆయన పేర్కొన్నారు.
ఎల్కతుర్తి మండలానికి విచ్చేసిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
