పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..

bahubalamtv Reporter
bahubalamtv.in

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..

బాహు బలంన్యూస్ హైదరాబాద్: రోమన్ కాథలిక్ చర్చి అధిపతి,ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు మార్గదర్శి అయిన పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రేమ, కరుణ మార్గాలను బోధిస్తూ, పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, శాంతి స్థాపన, అంతర్ధార్మిక సామరస్యం కోసం పోప్ ఫ్రాన్సిస్ చేసిన కృషి అసాధారణమని, స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు.
అర్జెంటీనాలో సామాన్య కుటుంబంలో జన్మించి, పోప్ స్థాయికి ఎదిగిన ఆయన నిరాడంబర జీవనశైలితో ప్రజలకు చేరువయ్యారని, వాటికన్ సిటీని, పోప్ స్థానాన్ని సామాన్యులకు మరింత సన్నిహితం చేసిన మహోన్నత గురువర్యులుగా చరిత్రలో నిలిచిపోతారని రేవంత్ రెడ్డి అన్నారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్ బోధనలు, సేవలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ దుఃఖ సమయంలో క్రైస్తవ సమాజానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన భక్తులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !