విద్యార్థులందరూ జాతీయ భావంతో ముందుకెళ్లాలి-ఏబీవీపీ..

బాహుబలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరియు సేవ భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత POLYCET-2025 శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం హుజురాబాద్ లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల లో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సాంగ్ జిల్లా సహా సేవ ప్రముఖ్ గుంటి శ్రీనివాస్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోస్కుల అజయ్ పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి అనంతరం మాట్లాడుతూ ఏబీవీపీ ఆందోళన కార్యక్రమాలే కాకుండా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యారంగంలోని ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపుతూ విద్యార్థి పరిషత్ విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేస్తూ నిరంతరం దేశ సమున్నది కోసం విద్యార్థుల శ్రేయస్సు కోసం ముందుండే ఏకైక ఆర్గనైజేషన్ ఏబీవీపీ అని అలాగే జాతీయ భావాలు కలిగిన విద్యార్థి పరిషత్ కార్యకర్త సామ జగన్ మోహన్ స్వతంత్ర అనంతరం నరహంతక నక్సలైట్లు విద్రోహ శక్తులు జాతీయ జెండాకు అవమానం చేస్తే అలాంటి సంఘ విద్రోహులను ఎదిరించి తన ప్రాణాలను విడిచిన సామ మోహన్ రెడ్డి అని అలాంటి దేశభక్తి కలిగిన విద్యార్థులుగా దేశ అభివృద్ధి కోసం అందరూ దేశం పట్ల భక్తి కలిగి ఉండాలని, విద్యార్థి పరిషత్ విద్యార్థులకు జాతీయ భావాలను నింపుతూ కేవలం ఏబీవీపీ ఆందోళన కార్యక్రమాలే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచంలోనే దేశభక్తి విద్యారంగ శ్రేయస్సు కలిగిన అతిపెద్ద విద్యార్థి సంస్థ విద్యార్థి పరిషత్ గా మన ముందు ఉంది. మనమందరం కూడా ఈ దేశం కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ అలాంటి విలువలతో సమాజం కోసం మనందరం కూడా మన వంతు సహాయం చేస్తూ పనిచేయాలని ఏబీవీపీ మరియు సేవ భారతి నిర్వహిస్తున్న ఉచిత POLYCET శిక్షణ తరగతుల విద్యార్థులు అందరూ కూడా భవిష్యత్తులో అత్యుత్తమ కళాశాలలో చేరి మీ భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ టీచర్ శ్రీనివాస్ , ఓంకార్, సాయి, బిట్టు, అభిలాష్, విద్యార్థులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !