బాహు బలంన్యూస్ జమ్మికుంట ప్రతినిధి : జమ్మికుంట పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏ సి బి .డీఎస్పీ రమణమూర్తి ,ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు .ఐకెపి కార్యాలయంలో సిసిగా పనిచేస్తున్న సురేష్ పదివేల లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు రెడ్ అండ్ గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే..
జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామంలో వివో ఏ (విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్) గా పనిచేస్తున్న స్వప్న కు గత ఐదు నెలల జీతం మంజూరు చేయడానికి సిసి (కమ్యూనిటీ కోఆర్డినేటర్) సురేష్.20000 డిమాండ్ చేయగా తను అంత ఇవ్వలేనని సి సి,సురేష్ ను బ్రతిమాలిన వినలేదన్నా రు.దీనితో చేసేది ఏమీ లేక ఏసీబీ ని ఆశ్రయించానని అన్నారు.గతంలో కూడా సురేష్ తన జీతం నుండి సగం జీతం ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు .
Post Views: 77