” రామ స్మరణ” తో భక్తి పారవశ్యమైన విద్యానగర్ కాలనీ — ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం.

bahubalamtv Reporter
bahubalamtv.in

” రామ స్మరణ” తో భక్తి పారవశ్యమైన విద్యానగర్ కాలనీ — ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం.

బాహు బలంన్యూస్ హుజరాబాద్,ప్రతినిధి :
హుజురాబాద్ స్థానిక పట్టణంలోని విద్యానగర్ లో ఆదివారం ఉదయం 10 గంటల నుండి విద్యానగర్ కాలనీ వాసులు ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు సుమారు 500 మంది హాజరై తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించగా భక్తులతో విద్యానగర్ కిటకిట లాడింది. "రామ నామ "స్మరణతో కళ్యాణ వేడుక పరవశించిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానంతరం తీర్థప్రసాదాలు భక్తులకు ఇచ్చి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా కళ్యాణ కార్యక్రమ నిర్వాహకులు చూశారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని భక్తులు తెలిపారు. కాగా దాతల సహకారంతో శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ లోని 25వ వార్డు, 30 వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజరాబాద్,ప్రతినిధి :
హుజురాబాద్ స్థానిక పట్టణంలోని విద్యానగర్ లో ఆదివారం ఉదయం 10 గంటల నుండి విద్యానగర్ కాలనీ వాసులు ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు సుమారు 500 మంది హాజరై తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించగా భక్తులతో విద్యానగర్ కిటకిట లాడింది. “రామ నామ “స్మరణతో కళ్యాణ వేడుక పరవశించిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానంతరం తీర్థప్రసాదాలు భక్తులకు ఇచ్చి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా కళ్యాణ కార్యక్రమ నిర్వాహకులు చూశారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని భక్తులు తెలిపారు. కాగా దాతల సహకారంతో శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ లోని 25వ వార్డు, 30 వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !