ఇల్లంతకుంటలో సీతారాముల కళ్యాణ మహోత్సవం: హాజరైన వొడితల ప్రణవ్

బాహు బలంన్యూస్ హుజురాబాద్/ఏప్రిల్ 06: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన సీతా రాముల కళ్యాణ మహోత్సవానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రా లు అందజేశారు. అనంతరం రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మజ్జిక పంపిణీని,స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారం భించారు.ఈ కార్యక్రమానికి భక్తులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !