పేదల ఇళ్లు కూల్చడమే ప్రజాపాలననా?: లోకిని రాజు ధ్వజం.

bahubalamtv Reporter
bahubalamtv.in

పేదల ఇళ్లు కూల్చడమే ప్రజాపాలననా?: లోకిని రాజు ధ్వజం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ మార్చి 11: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బ్రతుకులపై బుల్డోజర్లు పెడుతోందని తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూదాన భూములలో నివసిస్తున్న ఇళ్లు లేని నిరుపేద ప్రజల ఇళ్లను అన్యాయంగా కూల్చివేసి, ఆ భూములను రాజకీయ బడా నాయకులకు ధారదత్తం చేసేలా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఖమ్మం వెలుగుమట్లలో బాధితుల కోసం పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క మరియు డాక్టర్ విశారదన్ మహారాజ్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
కవితక్క దీక్షకు పూర్తి మద్దతు
పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న కవితక్క ధైర్యానికి, నిబద్ధతకు తాము అండగా ఉంటామని లోకిని రాజు ప్రకటించారు. "అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గను.. బాధితులకు న్యాయం జరిగే వరకు నా దీక్ష ఆగదు" అని ఆమె చెప్పడం ప్రజల పట్ల ఆమెకున్న అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసి రోడ్డున పడ్డ బాధితులకు ప్రభుత్వం వెంటనే అదే చోట ఇంటి స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కవితక్క చేస్తున్న ఈ పోరాటం ఒక వ్యక్తి కోసం కాదని, బాధితుల భవిష్యత్తు కోసం అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, అప్పటివరకు ఈ దీక్షకు తెలంగాణ ఆదివాసి జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని లోకిని రాజు హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ మార్చి 11: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బ్రతుకులపై బుల్డోజర్లు పెడుతోందని తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూదాన భూములలో నివసిస్తున్న ఇళ్లు లేని నిరుపేద ప్రజల ఇళ్లను అన్యాయంగా కూల్చివేసి, ఆ భూములను రాజకీయ బడా నాయకులకు ధారదత్తం చేసేలా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఖమ్మం వెలుగుమట్లలో బాధితుల కోసం పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క మరియు డాక్టర్ విశారదన్ మహారాజ్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
కవితక్క దీక్షకు పూర్తి మద్దతు
పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న కవితక్క ధైర్యానికి, నిబద్ధతకు తాము అండగా ఉంటామని లోకిని రాజు ప్రకటించారు. “అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గను.. బాధితులకు న్యాయం జరిగే వరకు నా దీక్ష ఆగదు” అని ఆమె చెప్పడం ప్రజల పట్ల ఆమెకున్న అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసి రోడ్డున పడ్డ బాధితులకు ప్రభుత్వం వెంటనే అదే చోట ఇంటి స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కవితక్క చేస్తున్న ఈ పోరాటం ఒక వ్యక్తి కోసం కాదని, బాధితుల భవిష్యత్తు కోసం అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, అప్పటివరకు ఈ దీక్షకు తెలంగాణ ఆదివాసి జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని లోకిని రాజు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !