బాహుబలం న్యూస్,హుజురాబాద్:ప్రతినిధి మార్చి 28:
హుజరాబాద్ జర్నలిస్టుల ప్రధాన సమస్య ఇళ్ల స్థలాల విషయంలో తాను గతంలో ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నానని, మొదటి ప్రాధాన్యతగా తీసుకొని జర్నలిస్టుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం జర్నలిస్టుల ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సింగపూర్ లోని ప్రణవ్ నివాసంలో కలిశారు . హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆయన శాలువాలతో సత్కరించారు .ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు కామని రవీందర్ లు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయినా ఇళ్ల స్థలాల విషయం గురించి మరోసారి ప్రణవ్ కు వివరించారు. తమ ఇళ్ల స్థలాల పై కేసు వేసిన కాంగ్రెస్ నాయకున్నీ వెంటనే కేసు ఉపసంహరించుకునేలా చేయాలని దీంతోపాటు వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి మీటర్లు ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ…ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పిన విధంగానే సమస్యను త్వరలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ మీటర్ల కేటాయింపు కోసం హుజురాబాద్ ట్రాన్స్కో డిఈ తో ఆయన మాట్లాడారు. విద్యుత్ మీటర్లు బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బొడ్డు శ్రీనివాస్, పోతరాజు సంపత్, తాటిపాముల దేవేందర్, నాగవెల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్కో డి ని కలిసిన హుజురాబాద్ ప్రెస్ క్లబ్….
హుజురాబాద్ జర్నలిస్టులుగా సాధించుకున్న ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్నామని, వెంటనే కట్టుకున్న ఇళ్లకు విద్యుత్ మీటర్లు అందించాలని ట్రాన్స్కో డిఈ కి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే వాటిలో తాము ఇల్లు కట్టుకున్నామని ఇంటి నెంబర్ ఆధారంగా మీటర్లు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన డిఈ ఇదే అంశంపై పై అధికారులకు తెలియజేసి నిబంధనల ప్రకారం మీటర్లు ఇప్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కోరం సుధాకర్ రెడ్డి ,నంబి భరణి కుమార్, చిలుక మారి సత్యరాజ్, వేల్పుల సునీల్, రవీందర్ రెడ్డి, మాచర్ల రాజు, సమ్మెట సతీష్ ,పబ్బ తిరుపతి, అజీమ్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.