జర్నలిస్టుల ఇళ్ల సమస్య కోసం ఎంత దూరమైనా వెళ్తాం ..

బాహు బలం న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి మార్చి 26;
హుజురాబాద్ జర్నలిస్టుల ప్రధాన సమస్య అయిన ఇళ్ల సమస్య పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తామని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు, కామని రవీందర్ లు అన్నారు. బుధవారం హుజరాబాద్ లోని సాయి రూప గార్డెన్లో ఏర్పాటుచేసిన హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొందామని, వాటిలో నిర్మాణం కూడా పూర్తి చేసామన్నారు. కాంగ్రెస్ నాయకుడు కావాలని కక్షపూరితంగా నివేషన స్థలాలపై కేసు వేశారని అన్నారు. నివేషన స్థలాల కోసం పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నామ ని, చివరిగా ముఖ్యమంత్రిని కలిసి తమ ఆవేదన తెలియజేస్తామన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నీవేషన స్థలాలపై ఉన్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తో మరో మారు సంప్రదింపులు చేస్తామని, సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీని కళారవళి అసోషియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కోరం సుధాకర్ రెడ్డి, కే సి రెడ్డి నరసింహారెడ్డి, మక్సుద్, భరణి కుమార్, పిల్లల సతీష్, వేల్పుల సునీల్, ముషకే శ్రీనివాస్, కేదాసి శ్రీధర్, కుమార్, పబ్బ తిరుపతి,మహేష్, సత్యరాజ్, పోతరాజు సంపత్, కుడికా ల సాయి, కే శ బోయిన స్వామి,సమ్మెట సతీష్, బొడ్డు శ్రీనివాస్, అజీమ్,బాబు, రాజు,కళా రవళి అసోసియేషన్ నాయకులు విష్ణుదాస్ గోపాలరావు, వంగల హనుమంత్, పుల్లూరి ప్రభాకర్ రావు, కన్నన్ దూరే రాజు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !