సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆర్టిఐ కమిషనర్ లను నియమించాలి సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ఏకగ్రీవంగా ఎన్నిక.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ఫిబ్రవరి 06:
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ను నియమిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం సాధన కమిటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పకడ్బందీగా అమలు చేయాలని, ఆర్‌టిఐ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలుకోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు ఇవ్వాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు, ప్రాణహాని ఉన్నప్పుడు కేవలం 48 గంటలలో సమాచారం అధికారులు ఇవ్వాలని అన్నారు.సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని ప్రజలతోపాటు అధికారులు కూడా ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ పంచాయతి నుండి మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని 30 రోజుల్లో సమాచారం తీసుకోవచ్చని అన్నారు. ఈ చట్టాన్ని ప్రజా ప్రయోజనాల నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని దుర్వినియోగం చేయకూడదని అవసరమైన సమాచారం మేరకే ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గోపీనాథ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం గ్రామ పంచాయతీలు మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి పౌరుడు దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెన్నెముక అయిన సమాచార హక్కు చట్టం 2005 కు సంబందించిన 4 (1) బి సంబంధించిన 17 అంశాల సమాచారం, రిజిస్టర్‌ 1, రిజిస్టర్‌ 2 న గల కాపీలను ఉచితంగా, స్వచ్చందంగా ప్రజలకు కోరినప్పుడు అధికారులు ఇవ్వాలని అన్నారు.మూడో వ్యక్తి సమాచారం విషయంలో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే సమాచారం అయితే సెక్షన్‌ 11 (1) ప్రకారంగా దరఖాస్తుదారునికి అధికారులు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇవ్వని అధికారులకు కనిష్టంగా 250 నుండి గరిష్టంగా 25 వేల వరకు జరిమానాలు సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్‌ విధిస్తారు అని అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సిబిఐ, సిఐడి, కోర్టు జడ్జిమెంట్‌, దేశ భద్రత సమాచారం, పోలీస్‌ స్టేషన్‌ భద్రత, ఆయుధాల సమాచారాన్ని మినహాయించబడిందన్నారు. ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని బయటకు తీయాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తుల మహేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి దీపక్ కులకర్ణి,పందుల రాజు గౌడ్, కె.రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..