కులాల మధ్య కుంపట్లు రాజేసే ప్రజా ప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ ఫిబ్రవరి 05:
రాజకీయ పబ్బం కోసం సమాజంలో కులాల మధ్యన కుంపటి రాజేయడం ఎం ఎల్ సి తీన్మార్ మల్లన్న కు పరిపాటిగా మారిందని, ముఖ్యంగా ఓసీ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని అనేక సార్లు తీవ్ర పద జాలం తో అవాకులు చవాకులు అసంబద్ధ ప్రేలాపనలతో పెట్రేగి పోతున్న బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికార పార్టీ ఎం ఎల్ సి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు సమాజంలో చీడ పురుగులలాంటి వారని ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు అన్నారు.
ఇలాంటి వ్యక్తులు చట్ట సభల్లో ఉండటం ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తీన్మార్ మల్లన్న పై కఠిన చర్యలు తీసుకోవాలని రామారావు డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాం లో అప్పటి సీఎం సామాజిక వర్గాన్ని మల్లన్న టార్గెట్ చేసి ప్రతి పక్షానికి దగ్గరయ్యారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సీఎం సామాజిక వర్గ అండతో ఎం ఎల్ సి స్థానాన్ని మల్లన్న పొంది మళ్లీ రాజకీయ పబ్బం కోసం ఇదే సీఎం సామాజిక వర్గాన్ని తీవ్ర పద జాలం తో దూషించి మరో సామాజిక వర్గాల ప్రాప్తం కోసం తీన్మార్ గా మారి ఓసీ సామాజిక వర్గాల మనో భావాలకు భంగం కలిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పోలాడి రామారావు పేర్కొన్నారు.
తెలంగాణా రాష్ట్రంలో అన్ని పల్లె గ్రామాల్లో కులాల మతాల కతీతంగా అందరూ అన్న దమ్ముళ్ళుగా కలిసి మెలిసి సఖ్యత గా ఉండటం సర్వ సాధారణమని,స్వార్థ ప్రయోజనాల పబ్బం గడుపుకోవడం కోసం ఒక వర్గాన్ని ఒక సారి మరో వర్గాన్ని మరోసారికించపర్చుతూ తీన్మార్ గా మారి అనుచితంగా మాట్లాడటం సమంజసం కాద న్నారు. కులాల, మతాల మధ్య కుంపట్లు పెట్టే ప్రజాప్రతినిధుల చట్ట సభల్లో సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకు రావాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకొని ఓసీ సామాజిక వర్గీయులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తక్షణమే భేషరతుగా ఉపసంహరించుకోవాలని లేని యెడల భవిష్యత్ లో పరాభవాన్ని అనుభవించి పచ్చాతాప పడాల్సి వస్తుందని పోలాడి రామారావు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..