బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ జనవరి 29
భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నర్సింహారావు పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి గత 5,6 సంవత్సరాల నుండి హుజురాబాద్ పరిసర ప్రాంతాలలో ఉచిత సేవలు అందించడం అభినందనీయమని MLC సురభి వాణీదేవి అన్నారు. గతంలో వీరు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలకు తాను ముఖ్య అతిథిగా హాజరు అయినట్లు వాణిదేవి తెలిపారు. పట్టణానికి చెందిన “పి వి సేవ సమితి” ప్రతినిధులు వాణిదేవి ని మంగళ వారం వారి స్వగృహంలో కలిసి పీవీ సేవ సమితి ఆధ్యర్యంలో “పీవీ విగ్రహాన్ని” ఏర్పాటు చేయనున్నట్లు వారికి వివరించారు. ఇందుకు వాణిదేవి సంతోషం వ్యక్తం చేశారు.నా సహాయ సహకారాలు ఉంటాయని ముందు ముందు ఇతర సేవ సంస్థలకు పీవీ సేవ సమితి నిర్వహించు సేవలు ఆదర్శం గా ఉండాలని సేవ సమితి ప్రతినిధులకు వాణిదేవి సూ చించారు. కేంద్ర ప్రభుత్వం పీవీ కి “భారతరత్న” ప్రకటిం చిన సందర్భాన్ని MLC మరోమారు గుర్తు చేస్తూ ఆనందా న్ని వ్యక్తపరిచినట్లు “పీవీ సేవ సమితి”అద్యక్షుడు తూము వెంకట్ రెడ్డి తెలిపారు,అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు B. మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
