జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన, డిప్యూటీ తహసిల్దార్ కు వినతి..

bahubalamtv Reporter
bahubalamtv.in

జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన, డిప్యూటీ తహసిల్దార్ కు వినతి..

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ జనవరి 27:. హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యలను పరిష్కరించా లంటూ టియు డబ్ల్యూ జే (ఐ.జె.యూ) హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి,పట్టణంలో ర్యాలీ నిర్వహించి తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ తాహసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దశలవారీగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి,కో-కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయి కృష్ణలు మాట్లాడుతూ.గత 20 సంవ త్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తూ గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొందినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని అనుకున్నప్పటికీ తమకు నిరా శే ఎదురైందన్నారు. ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను కూడా వెంటనే పరి ష్కరించాలని వారు పేర్కొన్నారు. నివేషన స్థలాలు విష యంలో ఇప్పటికే ఇద్దరు జర్నలిస్టులు మనో వేదనతో చని పోయారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కేటాయించిన స్థలాల్లోనే ఇందిరమ్మ గృహ పథకం కింద పూర్తిస్థాయిలో ఇళ్ళు కట్టించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇళ్ల సమస్యలను పరిష్కరించే వరకు దశలవారీగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా మని వారు హెచ్చరించారు ప్రజా ప్రతి నిధులు, మంత్రు లు,అధికారులు తమ గృహాల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశా రు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ జిల్లా ఉపా ధ్యక్షుడు నంబి భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివి జన్ అధ్యక్షుడు మక్సుద్,జిల్లా నాయకులు చిలుకమారి సత్యరాజ్, వేల్పుల సునీల్,బొడ్డు శ్రీనివాస్ తో పాటు సీని యర్ జర్నలిస్టులు మామిడి రవీందర్,తిరునగరి ఆంజనే యస్వామి,మండల యాదగిరి, అల్లి నరేందర్,సురుకంటి తిరుపతిరెడ్డి,ప్రెస్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !