- బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ జనవరి 26.
భారత రత్న,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
భారత రాజ్యాంగ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సమాఖ్య కార్యాలయం ఆవరణలో రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం నాయకుల తో కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రం లొని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర ఎంతో విశిష్టమైనదని, మన జాతిపిత మహాత్మాగాంధీ,లాలా లజపతిరాయి, బిపిన్ చంద్రపాల్,బాల గంగాధర తిలక్, భగత్ సింగ్.ఆజాద్ చంద్రశేఖర్, లుపండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్,సర్దార్ వల్లభాయ్ పటేల్,లాల్ బహదూర్ శాస్త్రి, గోపాల కృష్ణ గోఖలే,మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో త్యాగ ధనులపోరాట ఫలితంగా బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి ఆగస్ట్ 15,1947సం.లో మన దేశానికి స్వాతంత్య్రం సిద్దించిందని రామారావు అన్నారు. అనంతరం ప్రజలందరికీ న్యాయం,స్వేచ్ఛ,సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949, నవంబర్ 26న ఆమోదించి,1950 జనవరి 26న అమల్లోకి వచ్చి నేడు 76 వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు రామారావు ప్రకటించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భారత రాజ్యాంగ స్ఫూర్తి కీలకం అని ప్రపంచంలో అనేక రాజ్యాంగంలో భారత రాజ్యాంగం గొప్పదని అటువంటి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబా సాహెబ్అంబేద్కర్ భారత దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత శిఖరం,సామాజిక న్యాయం కోసం, అందరికీ సమాన హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన ప్రపంచం మెచ్చే దిగ్గజ నాయకుడు అంబేద్కర్ అని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం పోరాడుతో స్వాతంత్య్ర సాధనకు పోరాడిన త్యాగధనులందరికీ జోహార్లు అర్పిస్తూ దేశ సమైక్యతకు మనమందరం పాటు పడాలని పొలాడి రామారావు పులుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు రైతు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు మానకొండూర్ మండలం లోని తన స్వగ్రామమైన వన్నారం గ్రామంలోని ప్రదాన కూడలిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పథకాన్ని పోలాడి రామారావు ఎగురవేశారు.
గ్రామ పంచాయతి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లోను, విద్యా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రాథమిక పాఠశాల వద్ద నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గ్రామస్థుల తో కలిసి రామారావు పాల్గొని గ్రామస్థులకు, పంచాయతి ఉద్యోగులకు,పాఠశాల ఉపాధ్యాయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి పాఠశాల విద్యార్థులకు నాయకుల తో కలిసి బహుమతులు ప్రధానం చేసి రామారావు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతి స్పెషల్ ఆఫీసర్ వెంకన్న, గ్రామ పంచాయతి సెక్రటరీ శారద, గ్రామ మాజీ సర్పంచ్ బాకారపు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గంగుల రవి, మాజీ ఉపసర్పంచ్ బుద్ధుల తిరుపతి, మాజీ వార్డు సభ్యులు.యాదవ సంఘం అధ్యక్షుడు బనుక తిరుపతి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి కొమురయ్య, నాయకులు బాకారపు రమేష్, బనుక వేణు, బాకారపు రాములు,జంగిలి రాకేష్ పోలాడి యాదగిరి రావు,ప్రభాకర్ రావు, సంబ కొమురెల్లి, ఆకునూరి లచ్చయ్య, ఆకునూరి రమేష్, బుద్దుల అంజయ్య,జినుక అనిల్,బుద్దుల, రాం చందర్, బుద్దుల స్వామి,జంగిలి రవి,మద్దెల నర్సయ్య ఏకుల రవి,తాళ్ళపల్లి కిషోర్ తదితరులతో పాటు పాఠశా ల, అంగన్వాడి, గ్రామ పంచాయతి ఉద్యోగులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నట్లు పోలాడి రామారావు తెలిపారు.

Post Views: 103










