తండ్రి కష్టానికి తనయుడి ప్రతిఫలం… కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించిన సంజయ్. అభినందించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు.

బహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 30:
ప్రతి తండ్రి తన కొడుకు ప్రయోజకుడు కావాలని కలలు కంటూ ఎంత కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకొని తన కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటారు. తనలాంటి కష్టం తన కొడుకు పడకూడదని ఓ తండ్రి కష్టపడి కుమారుడిని చదివిస్తే తండ్రి కొడుకు పై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ కష్టపడి చదివి ప్రభుత్వ కొలువు తెచ్చుకున్నాడు. వివరాలుకెళ్తే హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుంకరి ఓదేలు (పాలు) మణెమ్మ లకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కష్టపడి ఇద్దరు కుమార్తెల వివాహము చేశారు. కొడుకు సంజయ్ ని గొప్పగా చూడాలనుకున్నాడు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా సంజయ్ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతూ ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూశాడు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడంతో 2024 బ్యాచ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ గా సెలక్షన్ అయ్యాడు. 9 నెలల ట్రైనింగ్ నిమిత్తం తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ అమీన్పూర్ హైదరాబాద్ పూర్తిచేసుకుని. ట్రైనింగ్లో బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డు విన్నర్ గా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నాడు. తమ కష్టానికి ప్రతిఫలాన్ని అందించిన కొడుకుని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ తన ఎదుగుదల కోసం వారి జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రులను గొప్పగా చూసుకుంటానని, రానున్న రోజుల్లో మరింత కష్టపడి ఇంతకంటే గొప్పగా ఎదిగి తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెప్పాడు. కానిస్టేబుల్ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా సంజయ్ ని అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !