అంచలంచెలుగా ఎదిగిన చందా… తాజాగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక.. నిబద్ధతతో ఎదిగిన ఆర్యవైశ్య నేత..

బహుబలం న్యూస్ సైదాపూర్ డిసెంబర్ 02;
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన చందా శ్రీనివాస్ వైశ్య కుటుంబం నుంచి ప్రజాసేవలో నిబద్ధతతో అంచలంచెలుగా ఎదిగారు.వివిధ పదవుల్లో పనిచేసిన ఆయన ఆర్యవైశ్య కులానికి, సైదాపూర్ గ్రామ ప్రజలకు సేవలు చేసిన నేతగా గుర్తింపు పొందారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి కుటుంబానికి చెందిన చందా నందయ్య- భూలక్ష్మి దంపతులకు చందా శ్రీనివాస్ జన్మించారు. అట్టడుగు స్థాయి నుంచి తన చతురతతో, మేధాశక్తితో అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా హుస్నా బాద్ పట్టణంలో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. సైదాపూ ర్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా 1995 నుంచి 2023 వరకు 29 సంవత్సరాల పాటు పనిచేశారు. ఈ క్రమంలో ఆర్యవైశ్యుల కులానికి, వ్యాపారులకు ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ ముందు నడిచి వారి మన్ననలు పొందారు. 2019 నుంచి 2024 వరకు సైదాపూర్ సర్పంచిగా, సర్పంచ్ ల ఫోరం మండల అధ్య క్షునిగా పనిచేశారు. ఈ క్రమంలో గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథం లో నడిపించి గ్రామ ప్రజల మన్ననలు పొందారు. సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షునిగా మండలంలోని గ్రామాల్లోని నెలకొన్న పలు సమస్యల పరిష్కారంలో పాలు పంచుకు న్నారు.ఈ క్రమంలో గతంలో 40 ఏళ్లుగా ఆర్యవైశ్య కుటుం బాలకు, ప్రజలకు సేవలు అందించడాన్ని గుర్తించిన సిద్ది పేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ తనని జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ గా ఎన్నుకున్నారు.చందా శ్రీనివాస్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం పట్ల అటు హుస్నాబాద్ పట్టణంతోపాటు జిల్లా ఆర్యవైశ్య కు టుంబ సభ్యులు, తను పుట్టి పెరిగిన గ్రామమైన సైదా పూర్ గ్రామంలో ప్రజలు, మండలంలోని పలువురు ప్రము ఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చందా శ్రీనివాస్ మాట్లాడుతూ… తన సేవలను గుర్తించి సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్ను కోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీ నారా యణ, ప్రధాన కార్యదర్శి కొండ మల్లికార్జున్, కార్యదర్శి గంప శ్రీనివాస్,నాయకులు అయిత రత్నాకర్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు వెన్నంటే నిలిచిన హుస్నా బాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ నాయకులకు రుణపడి ఉంటానని తెలిపారు. తన మీద నమ్మకంతో ఈ పదవిని అందించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్య వైశ్య కుటుంబ సభ్యులకు తన వంతు సేవలు అందిస్తాన ని ఆయన హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !