మా తండ్రి గారి స్థిరాస్తి నా సగభాగం నాకు ఇప్పించండి .కలెక్టర్ కు ఫిర్యాదు. డి ఎల్ పి ఓ ద్వారా విచారణ.

బహుబలం న్యూస్ ప్రతినిధి సైదాపూర్
నవంబర్ 12: సైదాపూర్ మండలం వెన్కే పల్లి గ్రామపంచాయతీ అధికారులు మా తండ్రిగారి పేరుమీద గల స్థిరాస్తి ఇంటి నెంబర్ 1-110 నెంబర్ గల ఇల్లు కలదని దానిని గ్రామపంచాయతీ అధికారులు నాకు తెలియకుండా నాకు చెందవలసినటువంటి నా సగభాగము ను గుర్రం కౌసల్య,భర్త మొండయ్య పేరున మార్పిడి చేసినారు.పలుమార్లు గ్రామపంచాయతీ సెక్రటరీ విన్నవించిన కూడా పట్టించుకోలేదని అట్టి దానిని నా సగభాగము నా పేరు మీద మార్పిడి చేయవలసినదిగా కోరుతూ,కలెక్టర్ కు గుర్రం తిరుపతయ్య వినతిపత్రం ఇవ్వడం జరిగినది.దానిని అనుసరించి దానిపై విచారణ అధికారిగా హుజురాబాద్ డిఎల్పిఓ విచారణకు నోటీసు జారీ చేస్తూ 2024 నవంబర్ 12 మంగళవారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో విచారణకు హాజరు కావాలని కోరినారు.గుర్రం తిరుపతయ్య గ్రామపంచాయతీ ఆవరణలో హుజురాబాద్ డి ఎల్ పి ఓ ముందు హాజరై తన వాంగ్మూలాన్ని మా తండ్రి గారి స్థిరాస్తి ఇల్లు 1-110 గల ఇల్లును అక్రమముగా వెన్కే పల్లి గ్రామపంచాయతీ అధికారులు నా సగభాగమును నాకు తెలియ కుండా ఇల్లును మార్పిడి చేసినారు కావున నా సగభాగమును నాకు ఇప్పించగలరని, ఈ కాగితాల ప్రకారముగా అమలు ఏమీ జరగలేదనీ గుర్రం తిరుపతయ్య, తన వాంగ్మూలన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దళిత బంధు పేరిట దగా చేసిన బీఆర్ఎస్.. దళితులకు అన్యాయం చేసిన మోసగాళ్ళు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా.. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు. మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. బతుకంతా వివాదాలే టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !