దళిత బంధు పేరిట దగా చేసిన బీఆర్ఎస్.. దళితులకు అన్యాయం చేసిన మోసగాళ్ళు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా.. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు. మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. బతుకంతా వివాదాలే టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..

బహుబలం ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 07:
దళిత బంధు పేరిట దగా చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ నాయకులే అని టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు నిధులు ఫ్రీజింగ్ చేసి ఆ నిధులను దారి మళ్లించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఈ విష యం అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డికి తెలుసని దానిని కప్పిపుచ్చి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు తనను గెలిపిస్తేనే రెండో విడత వస్తుంది అని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాడు తీరా గెలిచాక ముఖం చాటేసి నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ఉన్న సమస్యలను గాలికి వదిలేసి కెసిఆర్ కేటీఆర్ మెప్పు పొందేందుకు పూటకో మాట మాట్లాడుతూ అవాకులు చెవాకులు పేలుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నాడు అన్నారు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు దళిత బంధు పేరిట భారీ కుంభకోణం చేశారని ఎవరెవరు ఎంత దోచుకున్నారో పక్కా ఆధారాలతో బయటపెడతాం అన్నారు ఈ విషయం పై విచారణ జరిపించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా మని దళితుల పొట్ట కొట్టి డబ్బులు దండుకున్న ప్రతి ఒక్క నాయకుడి బండారం బయట పెడతాం అన్నారు దళిత బంధు పేరిట రాజకీయాలు చేస్తుంది నువ్వు ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్న నువ్వు అప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకు వెళ్ళలేదని హుజురాబాద్ నియోజక వర్గం అభివృద్ధికి వొడితల ప్రణవ్ గారు విశేష కృషి చేస్తు న్నారు అది జీర్ణించుకోలేక కేసీఆర్ కేటీఆర్ కు బానిసగా మారి నోటికి వచ్చినట్టు కౌశిక్ రెడ్డి మొరుగుతున్నాడు అని మండి పడ్డారు దళిత బంధు విషయం పై కాంగ్రెస్ ప్రభు త్వం దృష్టి సారిస్తుందని తప్పకుండా దళితులకు న్యాయం చేస్తుంది పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభు త్వం పెద్దపీట వేస్తుంది ఎవరు అయోమయానికి గురి కావద్దని విజ్ఞప్తి చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దళిత బంధు పేరిట దగా చేసిన బీఆర్ఎస్.. దళితులకు అన్యాయం చేసిన మోసగాళ్ళు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా.. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు. మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. బతుకంతా వివాదాలే టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !