ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డీఓకి వినతి.

బహుబలం ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 06:కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో గల SRSP ప్రధాన కాలువను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతు న్నారని యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ బుధ వారం హుజూరాబాద్ ఆర్డిఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి SRSP కి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని ఇండ్లు నిర్మాణాలు చేపడుతున్నారని ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేశారు.
ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు పట్టించు కోకపోవడంతో యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని ఆక్రమించు కొని పలు నిర్మాణాలు చేపడుతున్నారని అట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తక్షణమే సదురు నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమి ని కాపాడాలని లేని పక్షంలో ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ సంబంధిత ఉన్నతాధికారులను సంబంధిత శాఖ మంత్రిని కలుస్తామని కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని అవస రాలకు, వివిధ శాఖల కార్యాలయాలకు కేటాయిస్తే నియో జకవర్గ ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దళిత బంధు పేరిట దగా చేసిన బీఆర్ఎస్.. దళితులకు అన్యాయం చేసిన మోసగాళ్ళు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా.. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు. మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. బతుకంతా వివాదాలే టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !