బాహు బలం ప్రతినిధి భూపాలపల్లి:
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు లో మిషన్ భగీరథ వాటర్ లోడ్రైనేజ్ వాటర్ కలిసి ప్రజలు ఇబ్బందులు పడుతూ అనారోగ్య పాలవుతున్నారని తక్షణమే స్థానిక శాసనసభ్యుడు ఐదో వార్డు ప్రజలకు డ్రైనేజ్ పనులను పూర్తిచేసి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరును అందించాలని జై మహాభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్పీ కే సాగర్ డిమాండ్ చేశారు భూపాలపల్లి నియోజకవర్గం జిల్లా కేంద్రమైన మరియు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో అధికార పార్టీ కౌన్సిలర్ ఉండగా కనీసం ప్రజలకు సరైన త్రాగు నీరు రావడంలేదని మిషన్ భగీరథ వాటర్ డ్రైనేజితో కూడిన మురుగు నీరు వస్తుందని అది తాగిన వారికి అనారోగ్య సమస్యల పాలవుతున్నారని దీనిని తక్షణమే స్థానిక వార్డ్ కౌన్సిలర్ కి పలుమార్లు విన్నవించుకున్న కూడా కౌన్సిలర్ పట్టించుకోకుం డా ఎక్కడ చెప్పుకుంటారో అక్కడ చెప్పుకోపోండి అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు సుమారు మూడు నెలలు గా రోజుల నుండి ఐదో వార్డు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మరియు అనారోగ్య పాలు అవుతున్నారు అని తెలిసి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే గాని వార్డు కౌన్సిలర్ గాని కనీస త్రాగునీరు ను కూడా అందించలేని దిక్కుమాలిన స్థితిలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మరియు అధికార పార్టీ కౌన్సిలర్ ఉన్నారు నేను సవాల్ విసురుతున్న గండ్ర సత్యనారాయణ రావు కి మీకు పాలన చేతకాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి మీరు ఎమ్మెల్యే అయ్యింది మా బతుకులు మార్చడానికి మీ బతుకులు మార్చుకోవడానికి మీరు ఏసీ కార్లలో ఏసీ బంగ్లాలలో మంచి వసతులు సదుపాయా 1⅘లతో రాజభోగాలను అనుభవిస్తున్నారు కానీ మీకు ఓటు వేసిన మేము ఈరోజు మురికి నీరు తాగి మురికి కాల్వ దగ్గర పడుకునే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు అధికారంలోకి వచ్చాక ఎవరికి నీళ్ళు అందిఇచ్చారు ఏ వార్డ్ లో బోర్ వేశారు అసలు ఏం చేశారు మీరు ఈరోజు భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఏమేమి చేశారు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా ప్రజలు రోడ్డు మీద కొచ్చి ప్రశ్నిస్తే అక్రమ కేసులు బెదిరింపులు భౌతిక దాడులకు దీని కోసమేనా మీరు అధికారంలోకి వచ్చింది అని నేను అడుగుతున్నాను కాబట్టి తక్షణమే స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏదైతే డ్రైనేజీ వాటర్ లైన్ ఏదైతే ఉన్నదో తక్షణమే మరమ్మత్తులు చేపట్టి సంబంధిత వార్డు ప్రజలకు నీటి కొరత ఏర్పడకుండా మిషిన్ భగీరథ ద్వారా త్రాగునీరును అందించాలని అనారోగ్యం పాలు కాకుండా జిల్లా ప్రజలను చూడాలని జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ స్థానిక శాసనసభ్యులను డిమాండ్ చేస్తున్నానని జై మహాభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు/వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఎస్పీ కే సాగర్ అన్నారు
