ధర్మ విజేత, మహా సామ్రాట్ అశోకుని ధర్మ దీక్ష దినోత్సవం

ధర్మ విజేత, మహా సామ్రాట్ అశోకుని ధర్మ దీక్ష దినోత్సవం

మిత్రులారా!
ఈరోజు ధర్మ విజేత, మహా సామ్రాట్ అశోకుని ధర్మ దీక్ష దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ దమ్మ వందనాలు!

1956 అక్టోబర్ 14వ తేదీ అశోక విజయ దశమి రోజున బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 6 లక్షల మంది అనుయాయులతో నాగపూర్ లో బౌద్ద దమ్మాన్ని స్వీకరించారు - ఇది ప్రపంచ మత చరిత్రలో అతి పెద్ద గొప్ప రికార్డు - బోధిసత్వ అంబేడ్కర్ భారత దేశంలో కుల పీడన విరగడకు, స్వేచ్ఛ - సమానత్వం - సౌభాతృత్వాలకు - దేశ పురోభివృద్ధికి బౌద్ధమే శరణ్యం అని భావించారు.

ఆనాడు అశోక చక్రవర్తి కళింగ యుద్ధానంతరం తీవ్ర వేదనా భరితుడై, విజయ దశమి రోజున కరుణ సారమైన బౌద్దాన్ని స్వీకరించి స్వస్థత పొందాడు - ఇక పై రాజ్య విస్తరణ కోసం ఆయుధం పట్టను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు - ప్రజలను నైతికంగా తీర్చి దిద్దిటమే గొప్ప పాలనగా భావించి దేశమంతా నైతిక నియమాలను ప్రోత్సహించే శాసనాలను వేలాదిగా చెక్కించాడు.

ఈ ప్రపంచంలో విస్తారమైన భూ భాగాలను పాలించిన చక్రవర్తులు అనేక మంది ఉన్నారు - వారిలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వారు కొందరే ఉంటారు - ఆ కొందరిలో అతి ముఖ్యుడు మహా సామ్రాట్ అశోకుడు.

ఈనాటి పాలకులలో అశోకుని స్ఫూర్తి ఒక్క శాతం ఉన్నా, మన దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది.

ప్రజలు అశోక చక్రవర్తి ధర్మ జీవితం గురించి తెలుసుకో లేనంత కాలం, దేశంలో స్వచ్ఛమైన పాలన గానీ, స్వచ్ఛమైన పాలకులు గానీ తయారు కాలేరు.

అశోకుని ప్రేమించే వారు ముఖ్యంగా తెలుసుకో వలసినది ఏమంటే, మత సామరస్యాన్ని చిత్త శుద్ధిగా పాటించటం, మూక మదం అనేది ఏ కోశానా లేకుండా ఉండటం.

ప్రేమ, మైత్రీ, దయ, కరుణ, దానం, క్షమ, సహనం వంటి ఉన్నత గుణాలను పెంపు చేసుకుంటూ, ఆ ఉదాత్త భావాలను ప్రచారం చేయాలి! శాంతి సామరస్యాల సమాజం కోసం త్యాగ నిరతితో కృషి చేయాలి! - హింస, ద్వేషం, వైరం, అసత్యం, దుశ్శీలత వంటి వాటిని దరి చేరనీయ కూడదు - అప్పుడే అశోక చక్రవర్తికి నిజమైన దమ్మ నివాళి ఇచ్చిన వాళ్లం అవుతాము. - ఇవి ఏమీ లేకుండా కేవలం అశోకుని కీర్తించటం వలన మనకు గానీ, సమాజానికి గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు.

మైత్రితో
మీ
కృష్ణార్జునరావు,
మంగళగిరి బుద్ధ విహార.
సెల్:98481 99098.
ది. 12- 10-2024.
🌹🩷🌹🩷🌹🩷🌹

Share ePaper Clip

Preparing image...

మిత్రులారా!
ఈరోజు ధర్మ విజేత, మహా సామ్రాట్ అశోకుని ధర్మ దీక్ష దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ దమ్మ వందనాలు!

1956 అక్టోబర్ 14వ తేదీ అశోక విజయ దశమి రోజున బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 6 లక్షల మంది అనుయాయులతో నాగపూర్ లో బౌద్ద దమ్మాన్ని స్వీకరించారు – ఇది ప్రపంచ మత చరిత్రలో అతి పెద్ద గొప్ప రికార్డు – బోధిసత్వ అంబేడ్కర్ భారత దేశంలో కుల పీడన విరగడకు, స్వేచ్ఛ – సమానత్వం – సౌభాతృత్వాలకు – దేశ పురోభివృద్ధికి బౌద్ధమే శరణ్యం అని భావించారు.

ఆనాడు అశోక చక్రవర్తి కళింగ యుద్ధానంతరం తీవ్ర వేదనా భరితుడై, విజయ దశమి రోజున కరుణ సారమైన బౌద్దాన్ని స్వీకరించి స్వస్థత పొందాడు – ఇక పై రాజ్య విస్తరణ కోసం ఆయుధం పట్టను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు – ప్రజలను నైతికంగా తీర్చి దిద్దిటమే గొప్ప పాలనగా భావించి దేశమంతా నైతిక నియమాలను ప్రోత్సహించే శాసనాలను వేలాదిగా చెక్కించాడు.

ఈ ప్రపంచంలో విస్తారమైన భూ భాగాలను పాలించిన చక్రవర్తులు అనేక మంది ఉన్నారు – వారిలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వారు కొందరే ఉంటారు – ఆ కొందరిలో అతి ముఖ్యుడు మహా సామ్రాట్ అశోకుడు.

ఈనాటి పాలకులలో అశోకుని స్ఫూర్తి ఒక్క శాతం ఉన్నా, మన దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది.

ప్రజలు అశోక చక్రవర్తి ధర్మ జీవితం గురించి తెలుసుకో లేనంత కాలం, దేశంలో స్వచ్ఛమైన పాలన గానీ, స్వచ్ఛమైన పాలకులు గానీ తయారు కాలేరు.

అశోకుని ప్రేమించే వారు ముఖ్యంగా తెలుసుకో వలసినది ఏమంటే, మత సామరస్యాన్ని చిత్త శుద్ధిగా పాటించటం, మూక మదం అనేది ఏ కోశానా లేకుండా ఉండటం.

ప్రేమ, మైత్రీ, దయ, కరుణ, దానం, క్షమ, సహనం వంటి ఉన్నత గుణాలను పెంపు చేసుకుంటూ, ఆ ఉదాత్త భావాలను ప్రచారం చేయాలి! శాంతి సామరస్యాల సమాజం కోసం త్యాగ నిరతితో కృషి చేయాలి! – హింస, ద్వేషం, వైరం, అసత్యం, దుశ్శీలత వంటి వాటిని దరి చేరనీయ కూడదు – అప్పుడే అశోక చక్రవర్తికి నిజమైన దమ్మ నివాళి ఇచ్చిన వాళ్లం అవుతాము. – ఇవి ఏమీ లేకుండా కేవలం అశోకుని కీర్తించటం వలన మనకు గానీ, సమాజానికి గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు.

మైత్రితో
మీ
కృష్ణార్జునరావు,
మంగళగిరి బుద్ధ విహార.
సెల్:98481 99098.
ది. 12- 10-2024.
🌹🩷🌹🩷🌹🩷🌹

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !