“నిజమైన ఆనందం ఏమిటంటే….”

“నేను మిమ్మల్ని స్వర్గంలో కలిసినప్పుడు, నేను మిమ్మల్ని గుర్తించి మీకు మరోసారి ధన్యవాదాలు చెప్పాలి.”
[ఒక వికలాంగుడి మాటలు భారతీయ కుబేరుడిని పరవశింప చేసాయి]

ఒకసారి ఒక ఇంటర్వ్యూలో భారతీయ బిలియనీర్ రతన్‌జీ టాటాను రేడియో ప్రెజెంటర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అడిగాడు.
“సార్, జీవితంలో అత్యంత సంతోషాన్ని పొందినప్పుడు మీకు ఏమి గుర్తుకు వస్తుంది?”
అందుకు రతన్‌జీ టాటా ఇలా చెప్పారు.

“నేను జీవితంలో సంతోషం యొక్క నాలుగు దశలను దాటాను. చివరకు నిజమైన ఆనందం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను… మొదటి దశ, సంపద మరియు వనరులను కూడబెట్టుకోవడం. కానీ ఈ దశలో నేను కోరుకున్నంత ఆనందం లభించలేదు. రెండవ దశ… విలువైన వస్తువులు మరియు వస్తువులను సేకరించడం. కానీ ఈ వస్తువుల యొక్క ప్రభావం కూడా తాత్కాలికమైనదని మరియు విలువైన వస్తువుల మెరుపు ఎక్కువ కాలం ఉండదని నేను గ్రహించాను. అప్పుడు మూడవ దశ వచ్చింది… అది ఒక పెద్ద ప్రాజెక్ట్ పొందడం. తద్వారా నాకు ఇండియా మరియు ఆఫ్రికాలో 95% డీజిల్ సరఫరా ఉండేది. నేను భారతదేశం మరియు ఆసియాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి యజమానిని కూడా అయ్యాను. కానీ ఇక్కడ కూడా నేను ఊహించినంత ఆనందం లభించలేదు. ఇకయనాల్గవ దశ ఏమిటంటే…, కొంతమంది వికలాంగ పిల్లలకు, దాదాపు 200 మంది పిల్లలకు వీల్ చైర్స్ కొనివ్వమని నా స్నేహితుడు నన్ను కోరాడు. స్నేహితుడి కోరిక మేరకు వెంటనే 200 వీల్ చైర్లు కొనేసి, తీసుకెళ్ళి ఇవ్వమన్నాను. కానీ నా మిత్రుడు ఏమన్నాడంటే…. నేను కూడా అతనితో వెళ్లి ఆ పిల్లలకు వీల్ చైర్లు తన చేతులతోనే ఇవ్వమని పట్టుబట్టాడు. సరేనని నేను రెడీ అయ్యి అతనితో వెళ్ళాను. అక్కడ ఆ పిల్లలకు ఈ చక్రాల కుర్చీలను నేనే నా చేతులతో ఇచ్చాను. అప్పుడు ఆ పిల్లల ముఖాల్లో విచిత్రమైన ఆనందం కనిపించింది. వాళ్లంతా వీల్‌ఛైర్స్ లో కూర్చుని సరదాగా తిరగడం చూశాను. తరువాత వారితో కలిసి ఒక పిక్నిక్ స్పాట్‌కు చేరుకున్నాము. అక్కడ వారు వీల్ ఛైర్లతోనే ఒక రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. గెలిచిన వారికి బహుమతిగా ఇచ్చిన డబ్బులను విచిత్రంగా అందరూ సమానంగా పంచుకుని పండగ చేసుకున్నారు.

అది చూశాక నా లోపల వింత అనుభూతి కలిగింది. నిజంగా అప్పుడు నేను నిజమైన, అపూర్వమైన ఆనందాన్ని అనుభవించాను. ఆతర్వాత నేను బయలుదేరాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ పిల్లలలో ఒకడు నా కాలు పట్టుకున్నాడు. నేను నెమ్మదిగా నా కాళ్ళను విడిపించుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఆ పిల్లవాడు నా ముఖం వైపు చూస్తూ నా కాళ్ళను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు.

నేను వంగి పిల్లవాడిని ఇలా అడిగాను: “మీకు ఇంకా ఏమైనా కావాలా?” అంటే…
అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం నన్ను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా జీవితంపట్ల నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది.

ఇంతకీ ఆ పిల్లవాడు ఏమన్నాడంటే…
“దయచేసి మిమ్మల్ని ఇంకొంతసేపు ఇలా దగ్గరగా చూడనివ్వండి. ఎందుకంటే నేను మీ ముఖాన్ని బాగా గుర్తుంచుకోవాలి అనుకుంటున్నాను.” అన్నాడు కృతజ్ఞత నిండిన మెరిసే కళ్ళతో. “ఏం ఎందుకలా?” అని నేనంటే… “మిమ్మల్ని మళ్ళీ నేను స్వర్గంలో కలిసినప్పుడు, అక్కడ మిమ్మల్ని బాగా గుర్తించగలను. మరియు ఇంకోసారి మీకు ధన్యవాదాలు చెప్పగలను.. అందుకే” అన్నాడు.

ఆ మాటలు వింటుంటే… అప్పుడు.. అప్పుడే… నాకు అసలైన ఆనందం అంటే ఏమిటో, అది ఎక్కడ ఉంటుందో అర్థమయ్యింది.” అన్నారు రతన్ టాటా.
====////====////===
_[ఇప్పుడు దాదాపు మనందరం సంపదలు ఉంటేనే ఆనందం అనే భ్రమలో ఉంటూ అసలైన ఆనందాన్ని తాకట్టు పెట్టి సంపదలను పోగేసుకుంటున్నాం. కానీ కోట్లు కూడబెట్టిన కుబేరులు చెప్పే ఇలాంటి మాటలు వింటే మనకు కనువిప్పు కలిగిస్తాయి. ******RBS*****

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..