తిప్పారపు సంపత్ పై కుట్ర మేడారం టీవీ పరకాల సమ్మయ్య గౌడ్ అరెస్ట్. నన్ను రాజకీయంగా దెబ్బ తీయడం కోసమే కుట్ర మాట్లాడిన వ్యక్తి కుట్రలు చేసిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలి -తిప్పారపు సంపత్ టీపీసీసీ ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ రాష్ట్ర ఇంచార్జి

సబ్బని వెంకటస్వామి బహుబలంప్రతినిధి హుజురాబాద్
సెప్టెంబర్ 15:
ఆదివారం రోజున హుజరాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో తిప్పారపు సంపత్ టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ రాష్ట్ర ఇంచార్జ్ మాట్లాడుతూ నాగార్జున పాల డైరీలో పాల పొడితో పాలు తయారు చేస్తున్నారు అని అధికారులకు ఫిర్యాదు చేయగా నాపై కుట్ర చేస్తూ నా అనుచరుడు 15 లక్షల రూపాయలు అడిగినట్టు ఒక ఆడియో రికార్డు రిలీజ్ చేశారు ఆ కేసులో నాగార్జున పాల డైరీ యజమాని పుల్లూరి ప్రభాకర్ రావు తో 15 లక్షల రూపాయలు అడిగి మాట్లాడిన వ్యక్తి ని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి పోలీసులు నిన్న మేడారం యూట్యూబ్ ఛానల్ పరకాల సమ్మయ్య గౌడ్ అరెస్టు చేయడం జరిగింది. పోలీసులు 15 లక్షల రూపాయలు అడిగింది నా అనుచరుడు కాదని నేను డబ్బులు అడగలేదని నాపై పరకాల సమ్మయ్య గౌడ్ తదితరులు కుట్ర చేశారని పోలీసులు విచారణలో నిగ్గు తేల్చారు. నాలాంటి దళిత నాయకుడిపై ఇలా కుట్రలు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నాం.సమాజంలో ప్రశ్నించడమే నేరమైతే గతంలో కూడా ఈటల రాజేందర్ ప్రశ్నించినందుకు అనేక అక్రమ కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టడం జరిగింది. మళ్లీ ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ప్రశ్నించడంతో మళ్లీ నాపై కుట్రలు మొదలైనాయి ఇలా అయితే అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే భయం లో దళితులు ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొంటున్నాం. నాగార్జున పాల డైరీ విషయంలో పోలీసులు నిజాలు తీర్చడం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను కానీ దాని వెనకాల ఇంకా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను తప్పు చేయలేదని నేను నాగార్జున డైరీ యజమాని డబ్బులు అడగలేదని నమ్మి నా పక్షాన ఉద్యమం చేసిన దళిత సంఘాలకు, ప్రజాసంఘాలకు, రిటైర్డ్ సిఐ భూమయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకనుండి నాపై ఎవరు కుట్ర చేసినా సహించేది లేదని మా ఓపికను పరీక్షించవద్దని దళితులు కన్నెర్ర చేస్తే ఏ ఒక్కరూ గ్రామాలలో తిరగరని కొంతమంది కుట్ర చేసే నాయకులకు హెచ్చరిస్తున్నాను. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం, మల్లయ్య,సాయి అరుణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !