చర్చనీయాంశంగా మారిన ప్రజాప్రతినిధుల సంబరాలు.. అడ్డు తొలగిందనేనా!? ఆరా తీస్తున్న ఇంటలిజెన్స్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తుమ్మేటి అభిమానులు.

బాహుబలం న్యూస్ హుజురాబాద్,సెప్టెంబర్ 15:
పేద ప్రజల పక్షాన అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి అండగా నిలిచే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి అకస్మాత్తుగా గుండె పోటుతో నిన్న మృతి చెందడంతో అక్రమార్కులైన కొందరు ప్రజాప్రతినిధులు నిన్న మందుతో విందు చేసుకోవడం హుజురాబాద్ నియోజకవర్గంలనే కాక జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.మేక వన్నె పులిలాగా మృతి చెందిన సమ్మిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి నట్లుగా నటించి ఆ అనంతరం అనుచరులతో మందు తాగుతూ చిందులు వేయడం వారి గోముఖ వ్యాగ్రాన్ని తలపించింది. తుమ్మేటి సమ్మిరెడ్డి ఒక ప్రజాప్రతినిధియే కాక నికార్స్ అయిన నాయకుడు కూడా.జమ్మికుంట, హుజురాబాద్,ఇల్లంతకుంట వంటివి ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, ప్రభుత్వ ప్రజల ధనాన్ని కొల్లగొడుతూ వెంచర్లు పెట్టిన కొందరు ప్రజాప్రతినిధులను,ఘరానా మోసగాళ్లను వ్యతిరేకించాడు.అలాంటి వారిపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ నేరుగా ప్రజలతో కలిసి ఆందోళనలు కూడా చేసిన గొప్ప వ్యక్తి తుమ్మేటి సమ్మిరెడ్డి. అంతేగాక పేద ప్రజలకు ఉపయోగపడవలసిన ఖనిజ సంపదను దోచుకోవాలని చూసిన వారిని ఎదిరించాడు. సమ్మిరెడ్డి రెండు పర్యాయాలు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తూ ఎంతోమంది పేదలకు మార్కెట్లో ఉపాధి కల్పించడమే గాక ఉద్యోగ అవకాశాలు కల్పించిన చరిత్ర కలదు. ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీలో మారే కొందరు ప్రజాప్రతినిధుల తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ విమర్శించిన కారణంగానే సమ్మిరెడ్డి చనిపోతే మింగుడు పడలేదని కొందరు భావిస్తున్నారు. పేదలకు అండగా నిలుస్తూనే ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని కాజేయాలని చూసిన వారి అంతు చూస్తూ ఉద్యమం కొనసాగించిన గొప్ప నేత తుమేటి సమ్మిరెడ్డి. అలాంటి తుమ్మేటి భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయ సాధన కోసం అక్రమార్కులపై పోరాడేందుకు తన అనుచరులు ఉన్నారన్న విషయాన్ని మరిచి కొందరు ప్రజాప్రతినిధులు ఆయన మృతి చెందిన అనంతరం మందుతో విందులు చేసుకొని సంబరాలు జరుపుకోవడం వారి అల్ప సంతోషానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతేగాక తుమ్మేటి ఏ ఏ అన్యాయాల అక్రమాలపై పోరాడుతు మృతి చెందాడో వాటిని తాము కొనసాగిస్తామని ఆయన వారసులు (రాజకీయ) బాహాటంగా చెప్పకపోయినా అనుచరుల ద్వారా సంకేతాలు ఇస్తున్నారు. నిన్న తుమ్మేటి మృతి సందర్భంగా సంబరాలు జరుపుకున్న ప్రజా పతినిధుల పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే హారా తీసి పేర్లతో సహా రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ఉన్నదధికారులకు నివేదించినట్లుగా తెలిసింది.ఇప్పటికైనా అవినీతి అక్రమాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకోవడం మానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచన చేసి మారాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !