కోల్ కతాలో జూనియర డాక్టర్ పై జరిగిన అత్యాచారం,హత్యను ఖండించండి. … జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సమత కమిటీ కన్వీనర్ వెలిదండి సుమలత.

బాహుబలం న్యూస్ హన్మకొండ ఆగస్టు 19:
నయింనగర్:పశ్చిమ బెంగాల్ కోల్ కతాలో జూనియర్ డాక్టర్ మౌమిత పై జరిగిన అమానవీయ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.జరిగిన అత్యాచారం, హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జన వేదిక రాష్ట్ర సమతా కమిటీ కన్వీనర్ వెలిదండి సుమలత. మానవ సమాజం మొత్తం ముక్త కంఠంతోఈ సంఘటనను తీవ్రంగా ఖండించాలని అన్నారు. వైద్య కళాశాల ఆసుపత్రి లో 31 ఏళ్ల ట్రైని డాక్టర్ దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన సంఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరు సక్రమంగా లేదని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదన్నారు.ఈ సంఘటన లో నిందితుడు ఒక్కడే కాదని సంబంధిత అధికారుల మద్దతుతో భారీ స్కెచ్ వేసి ప్లాను ప్రకారంగా వారి ప్రమే యంతోనే జరిగివుంటుందని జరిగిన ఘోరమైన సంఘట నను చూస్తే అర్ధం అవుతుందన్నారు.నిందితులు ఎంత పలుకుబడి వున్న వారైనప్పటికి వదిలిపెట్టకుండా,చట్ట పరంగా కఠినంగా శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు.అనాగరిక సమాజంలో కూడా మహిళపట్ల ఇంత చులకన భావం కనిపించలేదు. మను షుల పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవ హరించలేదని చరిత్ర చెపుతున్నప్పటికి, నాగరిక సమాజం లో ఉండీ కూడా,స్త్రీలను అమ్మగా,చెల్లిగా, మన ఇంటి బిడ్డగా చూడకుండా,మహిళలను చెరచడం, హత్యలు చేయడం ఎంత అన్యాయం అన్నారు.కోల్ కత్తా లో ఆర్ జీ కార్ మెడికల్ హాస్పిటల్ లోనే కాదు ఇంతకుముందు దేశంలో అనేక ప్రాంతాలలో మహిళలపై దారుణాలు జరిగాయి కానీ,పాలకులు వీటిని నివారించడంలో,నింది తులను శిక్షించడంలో పూర్తిగా,ఘోరంగా వైఫల్యం చెందు తున్నారు. దాని ఫలితమే నేడు కోల్ కతాలో వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్న ఒక యంగ్ మెడికోను దేశం కోల్పోయింది.స్త్రీలపై,సామాన్య,మద్య తరగతి,రైతు కూలీలపై చివరికి వృద్దులు,పసిపిల్లలను చెరబడితే పట్టిం చుకోకుండా, జరిగిన ఘటనలపై ఏమాత్రం స్పందించకుం డా ఉండడం మూలం గానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి దారుణమైన సంఘటనలకు పాలకులే పూర్తి బాధ్యత వహించాలి.నేడు కోల్ కత్తా లో రేపు ఇంకోకాడ ఇలాంటి ఘటనలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దోషులను త్వరగా గుర్తించి సత్వర న్యాయం జరిగేలా కోర్టులు సరి యైన సూచనలు చేయాలని కోరారు.కోల్ కతా సంఘటన పై నిజాయితీ పరులైన ఉన్నతాధికారుల చేత విచారణ జరపాలని,కోల్ కత్తా అత్యాచారం,హత్య ఘటనలో ఎంత మంది దోషులు ఉన్నారో తేల్చి వారిని కఠినంగా శిక్షించి మౌమిత కుటుంబానికి న్యాయం చేయాలని జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తుందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..