20న హుజురాబాద్ లో సీపీఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం విజయవంతం చేయండి… ఎన్నికల హామీల అమలు కు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయి లో కాలేదు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి.

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 17;
ఈనెల 20న హుజురాబాద్ లోని మధువని గార్డెన్ లో సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి రాష్ట్ర కార్యాదర్శి కూనమనేని సాంబశివరావు హాజరుకానున్నారని, అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో వివిధ పార్టీల నుంచి సిపిఐ పార్టీలోకి చేరికలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం హుజరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆలోచనలు లేకుండా హామీలు ఇచ్చిందని, గడిచిన తొమ్మిది నెలలుగా హామీల అమలుకు సరైన కార్యా చరణ చేపట్టలేదని ఆయన అన్నారు.ఎన్నికల హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చే వరకు ప్రజల తరఫున సిపిఐ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుందని, అమలు మాత్రం ఆ స్థాయిలో జరగలేదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఈనెల 31 లోపు 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ కెనాల్ పై ఆధార పడి వ్యవసాయం చేసే రైతులు ఇంకా దుక్కులు దున్నలేదని,నీళ్లు లేక చాలా మంది రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వెంటనే ప్రభు త్వం స్పందించి క్రాప్ హాలిడేను ప్రకటిస్తూ ఎకరానికి 50,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.గత ప్రభు త్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమి లేదని పార్టీల జెండాలు మారాయి తప్పా వేరే ఏమి లేదన్నారు.హుజురాబాద్ లో గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఉంటున్నాయని,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కొంతమంది కౌన్సిలర్లు వేలల్లో వసూలు చేశారని ఆరోపించారు. సెప్టెంబర్ 15 లోపు ఈ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పేదలతో వెళ్లి ఆ ఇళ్లను ఆక్రమించుకుం టామని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,బోయిని అశోక్ మండల కార్యదర్శి గోవిందు రవి నాయకులు చాంద్ పాషా,రాజు,రాములు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామా రపు వెంకటేష్,నాయకులు రాము యాదవ్,ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ లంక దాసరి కళ్యాణ్,కృష్ణ,రోహిత్,తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..