మంద కృష్ణ మాదిగ విజయోత్సవ ర్యాలీకి లక్షలాదిగా తరలిరండి.ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రంమాదిగ పిలుపు

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి, హుజురాబాద్: ఆగస్టు 12:మహాజననేత మంద కృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా మాదిగ మరియు ఉపకులాల అభివృద్ధికి దోహదపడే ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన విజయం సాధించి ఢిల్లీ నగరం నుండి ఆగస్టు 13న హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ట్యాంక్ బండ్ మీదుగా బషీర్ బాగ్ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వరకు లక్షలాదిమంది మాదిగ మరియు ఉప కులాల, ప్రజాస్వామిక వాదులతో జరిగే విజయోత్సవ ర్యాలీకి హుజురాబాద్ మండలంలో ఉన్న ప్రతి మాదిగ పల్లె నుండి మాదిగ యువకులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, డప్పు కళాకారులు తదితర యావత్తు మాదిగ జాతి ప్రజలు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రంమాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం హుజురాబాదు ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల సూర్యుడు మందకృష్ణమాదిగ నిరంతర పోరాటాన్ని, మాదిగల ఆకాంక్షను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుర్తించి సంచలన తీర్పునిచ్చారన్నారు. కనూక మాదిగ మరియు ఉపకులాల ప్రజలందరూ లక్షలాదిగా హైదరాబాద్ నగరానికి తరలివచ్చి ర్యాలీని మరియు సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ మాజీ చైర్మన్ తునికి సమ్మయ్య , బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి కలవల మల్లయ్య, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి వేల్పుల ప్రభాకర్, నాయకులు కొత్తూరు జీవన్ కుమార్, కనకం శ్రీకాంత్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..