నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ హన్మకొండ జిల్లా చైర్మన్ గా డాక్టర్ భాస్కర్ రావు కూడికాల

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి
హుజురాబాద్ 28:  హైదరాబాద్ పట్టణంలోని తెలంగాణ సరస్వతి పరిషత్ వేదికగా నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ తో గ్రీట్ అండ్ మీట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రేట్ సమ్మిట్, కన్జ్యూమర్ అవేర్నెస్ కార్యక్రమంలో హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ భాస్కర్ రావు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర హన్మకొండ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. గత కొన్ని సంవత్సరాల నుండి వివిధ రంగాలలో చేస్తున్నటువంటి పలు సామాజిక సేవ కార్యక్రమాలు, ప్రచారాలు మరియు అవగాహన సదస్సులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంల ద్వారా పలు సేవ కార్యక్రమాలు మరియు సేవలందిస్తు న్న డాక్టర్ భాస్కర్ రావుకు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ హన్మకొండ జిల్లా చైర్మన్ గా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ. వినియోగదారులకు సేవలు అందించాలని ఉద్దేశంతో వినియోగదారులకు చట్టపరంగా ఉన్న హక్కుల పట్ల అవగాహన లేక అనేక మంది నష్టపోతున్నారన్నారు. కాలం మారుతున్నాకొద్ది డిజిటల్ లావాదేవీలు ఆన్లైన్ ట్రాన్సజాక్షన్స్, టెలీమార్కెటింగ్ మరియు ఆన్లైన్ వస్తువులు రకరకాల విక్రయలు ప్రపంచమంతటా జరుగుతుందన్నారు. దీని ద్వారా ఆన్లైన్ మోసా లు, సైబర్ మోసాలు, నాణ్యత లేని వస్తువులు కానీ మరేదైనా కానీ ఇలా అనేక మంది వినియో గదారులకు చట్టపరంగా ఉన్న హక్కుల పట్ల అవగాహన లేక, తెలియకా నష్టపోతున్నారన్నా రు. అటువంటి వారి పక్షాన ఉండి పోరాడి న్యా యం చేకూరే విధంగా చూడటమే లక్ష్యమని పేర్కొన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం మొట్టమొదటగా భారతదేశంలో 1986 డిసెంబర్ 24న అమల్లోకి వచ్చిందన్నారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జాతీయ విని యోగదారుల హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తు న్నామని తెలిపారు. సుమారుగా 35 సంవత్స రాలుగా మారుతున్న కాలానికి ఆనుగుణంగా వాణిజ్య వ్యాపార పద్ధతుల్లో శాస్త్ర సాంకేతికత పెరగడంతో డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, టెలి మార్కెటింగ్ అందుబాటులోకి వచ్చాయన్నారు. దీంతో వినియోగదారుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పాత చట్టం స్థానంలో 2019లో కొత్త రక్షణ చట్టంను తెచ్చిందన్నారు. ఈ నూతన చట్టం 2020 జులై 20 నుంచి భారత దేశం అంతటా అమల్లోకి వచ్చిందన్నారు. ‘విని యోగదారుడా మేలుకో’ అనే నినాదంతో విని యోగదారుల వ్యవహారాలు ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వినియో గదారుల కోసం, వినియోగదారుల ప్రయోజనం పట్ల పలు కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ కొత్త చట్టంలో ముఖ్యంగా ఈ- కామ ర్స్ నిబంధనలు తీసుకురావడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి టేలీమార్కెటింగ్ సంస్థలకు కూడా ఇది వర్తించనుందనీ తెలిపారు.ఈ కొత్త చట్టంలో వినియోగదారుల కమిషన్ లో అమ్ముకొనుదా రుడు బాధ్యుడిగా చేసేవారని, నేడు ప్రోడక్ట్ ఆఫ్ లేయబులిటీ, వినియోగదారులుకు ఫిర్యాదు చేయడంలో పలు కొత్త విషయల్ని వెసులుబాటు కలిగించే పద్ధతుల్లో ప్రవేశ పెట్టడం జరిగిందన్నా రు. అలాగే జిల్లా స్థాయిలో కంజ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుందని, వస్తు సేవల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్‌‌లో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ముఖ్యంగా ఎన్ సి హెచ్ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. 1915, 1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్‌కు తెలియజేస్తారన్నారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా వినియోగదారులు తమకు జరిగిన నష్టాలను, అన్యాయాలకు, కష్టాలపై 24/7 ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. వస్తువు కొనేటపుడు బిల్లు, రశీదు, ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఇన్‌వాయిస్‌లను, ఐడీలను భద్రపరుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఎందుకంటే ఫిర్యాదు సమయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుందన్నారు. వినియోగదారుల కమిషన్ పరిధిలోకి ప్రభుత్వ శాఖలు కూడా వస్తాయని, న్యాయవాది సాయం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. రూ.5 లక్షలు విలువైన వస్తుసేవల వరకు సంబంధించిన కేసులలో ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనక్కర్లేదన్నారు. చట్ట ప్రకారం కేసు నమోదైన 90-120 రోజుల్లోపు తీర్పులు వెలువరిస్తారన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పుపై అసంతృప్తి ఉంటే రాష్ట్ర కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమస శ్రీకాంత్ గౌడ్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ రెడ్డి, హెడ్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ ఫుడ్ లేబరటరీ. M.V.L. నాగేశ్వరావు, NCRC నేషనల్ చైర్మన్, Dr. నలమాస శ్రీకాంత్ గౌడ్, NCRC తెలంగాణ రాష్ట్ర చైర్మన్, డాక్టర్ వాంకుడోత్ భాస్కర్ పవార్ మల్టీ వరల్డ్ రికార్డ్ హోల్డర్, విజయ్ కుమార్ రిటైర్డ్ ఫుడ్ కంట్రోలర్ అఫ్ తెలంగాణ రాష్ట్రం, డి ప్రవీణ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ యునైటెడ్ హెరిటేజ్, ఆర్ట్స్ & కల్చర్ ఆర్గనైజేషన్ మలేషియా, నల్ల రాధాకృష్ణ నేషనల్ ప్రెసిడెంట్ బహుజన సాహిత్య అకాడమీ, ఇమ్మ డి ధర్మారెడ్డి ఎన్ సి ఆర్ సి సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !