విద్యారంగాన్ని విస్మరించిన తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ -నిరుద్యోగుల ఆశలపై నీళ్ళుచల్లిన కాంగ్రెస్.. -అరకోర నిధులు విద్యార్థుల పాలిటశాపం.. -ఏబివిపి రాష్ట్ర నాయకులు అజయ్..

సబ్బనీ వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్ .
జూలై 27:
విద్యార్థుల,నిరుద్యోగుల ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ ఆరోపించారు.తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేషపెట్టిన రాష్ట్ర బడ్జెటుపై అజయ్ స్పందిస్తూ ,నాణ్య మైన విద్య అందించడం దేవుడెరుగని,కనీస విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం మాదిరిగానే విద్యార్థుల,నిరుద్యోగుల ఆశలు,ఆశయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు చల్లిందని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీఎంబర్సుమెంటు ,ఉపకారవేతనా లు  రూ.7వేల కోట్లకుపైగా పెండింగులో ఉన్నాయని,సకా లంలో ఫీజులు రాక ఉన్నత విద్యకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తామని విద్యార్థులను మభ్యపెడుతూ ప్రభుత్వరంగ యూనివర్సిటీలను పూర్తిగా పట్టించు కోలేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా వ్యవస్థల ను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడునెలలు కావస్తున్నా,యూనివర్సిటీలకు వైస్ చాన్సులర్లను నియమించలేని దుర్భాగ్యమైన పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.వెంటనే యూనివర్సిటీలకు విసిల నియామకం చేపట్టాలని,నాణ్యమైన విద్యను అందించేలా బడ్జెటుని పునరాలోచించి,విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని అజయ్ అల్టిమేటం జారీ చేశారు.లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెంటపడుతామని అన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !