మరణాలు సంభవించేదాకా అటువైపు తొంగి చూడరా ..మునిసిపల్ అధికారులు ?

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధిహజూరాబాద్ జులై 22:

హుజురాబాద్ పట్టణంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అనేక ఉదంతాలను బట్టి చూస్తే అర్థమవుతున్నది.పాత హుజురాబా ద్ పట్టణం పరిధిలోని గల మామిళ్ళ వాడలో కొన్ని దశాబ్దాల క్రితం ప్రజల దాహార్తిని తీర్చే అతిపెద్ద మంచినీటి బావి హుజురాబాద్ పట్టణంలో గాని.పట్టణ పరిధిలో దూరంగా ఉన్నటువంటి అనేక మంచినీటి బావులలో మామిళ్ళ వాడలోని బావి మాత్రమే అతిపెద్దదని పలు కాలనీలవాసులు పేర్కొంటు న్నారు.దాదాపు ఐదారు దశాబ్దాల క్రితం అప్పటి అవసరాల నిమిత్తం నిర్మించబడిన ఈ అతిపెద్ద మంచినీటి బావి కొన్ని వేలాదిమంది పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. ఇన్ని దశాబ్దాలలో కూడా ఒక్కసారైనను ఈ బావి అడుగంటి పోలేదని ఆరేడు సంవత్సరాల పాటు వరుసగా కరువు కాటకాలు వచ్చినప్పటికీ ఈ భావి మాత్రం సమృద్ధిగా ప్రజల అవసరాలను తీరుస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. దశాబ్దాల క్రితమే ఈ బావిని రాతి కట్టడంగా మల్చడంతో ఇన్నాళ్లుగా పటిష్టంగా ఉంది.కాలక్రమేనా భూమి పొరల్లో ఏర్పడిన వ్యత్యాసాల వల్ల కొద్ది నెలలుగా కృంగిపోతూ వస్తోంది.మొన్నటి ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో బావి చుట్టూ నేల కుంగిపోవడంతో బావి చుట్టూ పెద్ద గొయ్యిలా ఏర్పడింది ఈ విషయంలో అధికారులు రంగంలోకి దిగి అప్పటి ఉపశమనం కోసం కొన్ని ట్రిప్పుల మొరం నింపి చేతులు దులుపుకున్నారు కానీ మళ్లీ కురిసిన వర్షాల వల్ల చుట్టూ బొందలా తయారైంది.ఆదమరచి.అను కోకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ బావి సమీపంలోకి వెళ్లినట్లయితే మట్టిలో పూర్తిగా కోరుకుపోవడం జరుగుతుంద ని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.వాస్తవానికి ఇంజనీరింగ్ అధికారులు బావి దగ్గరకు వచ్చి పరిస్థితిలను పూర్తి గా పరిశీలించిన తర్వాత చుట్టూ కంకర నింపి దానిపైన రెండు మూడు వందల గట్టిపురం నింపినట్లయితేనే ఈ బావిని తిరిగి ఉపయోగించుకోవడానికి కాలనీవాసులకు వీలు కలుగుతుందని అంటున్నారు.అయితే ఆ దిశగా నగర పంచాయతీ కమిషనర్ ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఆ బావి చుట్టూ సుమారు నాలుగు రోడ్లు ఉండడంతో ప్రతిరోజు తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు వందల మంది పసిపిల్లలు విద్యార్థులు ప్రజలు మహిళలు అటు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని పలు కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు బాధ్యతగల పౌరులు నగర పంచాయతీకి చెందిన కౌన్సిలర్లకు అధికారులకు ఫోన్ల ద్వారా జరగబోయే ప్రమాదాల గురించి వివరిస్తున్నప్పటికీ కమిషనర్ ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు ప్రమాదం జరిగి అనుకోకుండా ఎవరైనా మృతి చెందితే తప్ప మునిసిపల్ కషనర్ ఇటువైపు తొంగి చూడరా అని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.బావిని గతంలో మాదిరిగా పటిష్టంగా తీర్చిదిద్దేవరకు మంచి నీటి అవసరాల కోసం మహిళలు ఆ బావి వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారు ఈ విషయంలో ఇప్పటికైనా కమిషనర్ స్పందించకపోతే ఒకటి రెండు రోజుల్లో మూడు కాలనీలకు చెందిన మహిళలందరూ పెద్ద సంఖ్య లో నగర పంచాయతీ ముందు ఆందోళన కార్య క్రమాలు చేపట్టడం జరుగుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..