హుజురాబాద్ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తా…! బాధితులకు తల ఒక్కరికి పదివేల చొప్పున రూ .3 లక్షల 10వేలు అందజేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటి స్థానాన్ని, తనవంతుగా తన శాసనసభ సభ్యుడిగా వచ్చిన జీతాన్ని బాధితులకు తల ఒక్కరికి పదివేల చొప్పున రూ .3 లక్షల 10వేలు అందజేసినట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా బాధితులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శించి ఒక్కో దుకాణానికి తక్షణ సాయంగా ఎమ్మెల్యే జీతం నుండి 3 లక్షల పదివేల రూపాయలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు తన వంతుగా రేకుల షెడ్డుల కొరకు లక్ష రూపాయలు ఇచ్చానన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆర్డీవో, తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్ సందర్శించి పరిశీలించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి నివేదించినప్పటికీ వారం రోజులు దాటిన కనీస నష్టపరిహారం మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించకపోవడం వారిని ఆదుకునేందుకు కనీస ప్రకటన చేయకపోవడం మంత్రి నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు బాధితులను పట్టించుకోవడం లేదనీ,అధికారులు వచ్చి ఎంక్వయిరీ చేసి వెళ్లిపోయారు కానీ ఎలాంటి ఆర్థిక సహాయము చేయ కపోవడం బాధాకరమన్నారు. అగ్ని ప్రమాద బాధితులు తెలంగాణ రాష్ట్రంలో లేరా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కి గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని వర్తించరా అని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగితే కనీసం పరామర్శించకపోవడం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చిన్న చూపుకు నిదర్శనం కాదా అని కౌశిక్ ప్రశ్నించారు. అగ్ని ప్రమాద బాధితులను ఆర్థికంగా ఆదుకోకపోతే తక్షణమే బాధితులతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రస్తావిస్తాననీ స్పష్టం చేశారు.బాధితులకు శాశ్వత ప్రతిపాదికన పునరవాసం కల్పించి అన్నవిధాల ఆదుకోవాలని కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు బాగు చేయాలి: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుజురాబాద్ నియోజకవర్గంలో పలుచోట్ల రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటిని బాగు చేయించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. వీణవంక మండలం వల్బపూర్, మామిడాలపల్లి, మల్లన్నపల్లి, జమ్మికుంట మండలం రాఘవరెడ్డిపేట -టేకుమట్ల బ్రిడ్జి, ఇల్లంతకుంట కమలాపూర్ హుజురాబాద్ మండలాల్లోని పలు గ్రామాలలో అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు శిథిలమై ప్రజలు అవస్థలకు గురవుతున్నారని తక్షణమే వాటిని బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మునిసిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్ వైస్ చైర్ పర్సన్ కోలిపాక నిర్మల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి, తాసిల్దార్ విజయ్ కుమార్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు బాధితులు పాల్గొన్నారు.

ఘనంగా కౌన్సిలర్ తిరుమల్ రెడ్డి జన్మదిన వేడుకలు:

హుజురాబాద్ మున్సిపల్ నాలుగవ వార్డు కౌన్సిలర్ ప్రతాప తిరుమల్ రెడ్డి జన్మదిన వేడుకలను అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కోలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా తిరుమలరెడ్డిచే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేక్ కట్ చేయించారు కేకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.తిరుమల్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుమల్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !