హుజురాబాద్ లో ప్రైవేట్ మాధవి నర్సింగ్ హోమ్ సీజ్ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లపై నిరంతర నిఘా డి ఆర్ ఎ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు డి ఎం హెచ్ ఓ సుజాత వెల్లడి..

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్
హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డులో గల మాధవి నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆసుపత్రిని శుక్రవారం రాత్రి డిఎంహెచ్ఓ అధికారి సుజాత ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ నర్సింగ్ హోంను సీజ్ చేశారు.బ్రూణ హత్య కేసు ఉదంతం లో ఈ ఆస్పత్రి పై గత రెండు రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎంహెచ్వో శుక్రవారం రాత్రి నర్సింగ్ హోమ్ ను
ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులన్నింటినీ తనిఖీ చేశారు.
అనంతరం పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని నర్సింగ్ హోమ్ లను ఇతర ప్రైవేట్ ఆస్పత్రులను ఇకపై నిశితంగా పరిశీలించడం జరుగుతుందని పటిష్టమైన నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హుజురాబాద్ జమ్మికుంట పట్టణాలలో గల ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ల పై ఓ కన్నేసి ఉంచామని ఈ ప్రాంతాల నుండి తరచుగా వస్తున్న ఫిర్యాదులను నిశితంగా పరిశీలిస్తున్నామని డి ఎం హెచ్ ఓ తెలిపారు.హుజురాబాద్ మాధవి నర్సింగ్ హోమ్ ఉదంతంలో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉన్నది… ఏ డాక్టర్ ఇందులో ఉన్నాడు తెర వెనుక సూత్రధారులు ఎవరున్నారు ఇలాంటి విషయాలపై స్థానిక పోలీసుల సహకారంతో కూపి లాగే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.ఇప్పటికే హుజురాబాద్ మాధవి నర్సింగ్ హోమ్ యజమాని పాపిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.నిబంధనలు పాటించకపోతే డాక్టర్ల రిజిస్ట్రేషన్లు వారి డిగ్రీలు రద్దయితాయని చెప్పారు. మాధవి నర్సింగ్ హోమ్ లో ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్లు ఎవరైనా పరోక్షంగా పనిచేస్తున్నారా అనే కోణంలో కూడా దృష్టి సారించామని తెలిపారు. మొన్నటి ఎంక్వయిరీ రిపోర్టు తమకు అందిన తర్వాత అన్ని అంశాలను పరిశీలించగా హుజురాబాద్ మాధవి నర్సింగ్ హోమ్ నిబంధనల ప్రకారం పనిచేయడం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. హుజురాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఈ ఉదంతంపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.కింది స్థాయి సిబ్బంది సహాయ సహకారాలతో సాధ్యమైనంత మేరకు హుజురాబాద్ జమ్మికుంట ప్రాంతాలతో పాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గల అన్ని నర్సింగ్ హోమ్లపై ప్రైవేట్ ఆస్పత్రులపై ఇకనుండి నిరంతరనిగా కొనసాగుతుందని డిఎంహెచ్వో సుజాత తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే తమరు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.మాధవి నర్సింగ్ హోమ్ లో దాదాపు గంటన్నరసేపు గడిపిన డిఎంహెచ్ఓ ఆసుపత్రిలో గల అన్ని విభాగాలను అన్ని రికార్డులను పరిశీలించి ఆ తరువాత అందుబాటులో ఉన్న రికార్డుల అన్నింటిని ఆమె సీజ్ చేచేసి తన వెంట తీసుకువెళ్లారు. డి ఎం హెచ్ ఓ వచ్చిన విష యం తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున మాధవి నర్సింగ్ ముందు చేరడంతో ప్రజలు చూస్తుండగానే తన సిబ్బంది సహకారంతో డిఎంహెచ్ఓ ఆసుపత్రిని అధికారికంగా సీజ్ చేసి ఆ తర్వాత పక్కనే గల దుర్గా ప్రైవేట్ ఆస్పత్రిని తనిఖీ చేసి పలు సూచనలు చేయడం జరిగింది.ఈ తనిఖీ కార్యక్రమంలో డీఎంహెచ్వో తో పాటు డాక్టర్ సనా జువేరియా ప్రోగ్రాం ఆఫీసర్ ఎం సి హెచ్ డిస్టిక్ మాస్ మీడియా ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కాంతారావు డ్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాజీ హుస్సేన్.పంజాల ప్రతాప్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !