సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజూరాబాద్ జులై 07:
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామం అంబేద్కర్ చౌరస్తా కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 వసంతాలు పూర్తయిన సందర్భంగా మరియు మహాజన నేత మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా ఏమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి స్వీట్స్ పంచి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1994 ప్రకాశం జిల్లా ఈదుముడి అనే చిన్న గ్రామంలో 20 మంది యువకులతో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాదిగల హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తూ అంచలంచలుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక కుల సంఘంగా ప్రసిద్ధి చెందినది.సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ఎమ్మార్పీఎస్ బహిరంగ సభలో పాల్గొనడం గొప్పవిషయము మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఒక మాదిగలకే కాక ఎస్సీ,ఎస్టీ ,బీసీ,మైనార్టీలకు, అగ్రవర్ణ పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆసరా పథకం, వితంతువు ల పెన్షన్ మొదలగు పథకాలను ఎమ్మార్పీఎస్ పోరాటం ద్వారా సాధించుకోవడం జరిగిందని అన్నారు.తెలంగాణ అమరవీరులైన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా మరియు ఉద్యోగం,ఇంటి స్థలం వంటి డిమాండ్స్ తో పాటు ప్రమోషన్లలో , విద్య ఉపాధి రంగాలలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రతి జిల్లా కేంద్రాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వంపై ఉద్యమాలు చేసి అనేక సంక్షేమ ఫలాలు సాదించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి దక్కుతుందని వారన్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం ఉద్యమం ద్వారానే సబ్బండ వర్గాల పేద ప్రజలు కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేసుకున్నారంటే అదీ కేవలం ఎమ్మార్పీఎస్ ఉద్యమ వల్లే. ఎమ్మార్పీఎస్ అంతిమ లక్ష్యం ఎ,బి,సి,డి వర్గీకరణ అయినప్పటికీ, సమాజంలో ఉండబడె ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం చేసిన ఏకైక కుల సంఘం ఎమ్మార్పీఎస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్ ,ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మారపల్లి శ్రీనివాస్,మాజీ మండలం అధ్యక్షులు రుద్రారపురవితేజ,సంజీవ్,రాజేంద్రప్ర సాద్,రాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు










