బాహుబలం న్యూస్ హుజురాబాద్,
కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న నరేడ్ల వినోద్ హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేస్ లో ఉండాలని పలువురు కోరుతున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వినోద్ పార్టీలొనే ఉంటూ పార్టీ ఎదుగుదలకు తనవంతుగా కృషి చేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పని చేసిన వినోద్ రెడ్డి కి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని స్థానికులు,మండ ల నాయకులు కోరుతున్నారు.వినోద్ రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే కష్టపడి పని చేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభిస్తుందని,ఇదే ఉత్సాహంతో మరి కొంత మంది నాయకులు పార్టీ అభివృద్ధి కొరకు పని చేస్తారని కొంత
మంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.ఈ సారి హుజూరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అవకాశం కల్పిం చేలా నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని పలువులు కోరుతున్నారు.
