నామినేషన్‌ దాఖలు చేసిన మోడీ…..

మోడీని ప్రతిపాదించిన నలుగురు సామాన్యులు
ఆ ప్రతిపాదించిన ఆ నలుగురు ఎవరో తెలుసా?

బాహుబలం న్యూస్ మే14 హుజురాబాద్
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు.కాశీనాథుడు కొలువైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని.. గంగా సప్తమి, పుష్య నక్షత్రం కలగలిసిన శుభ ముహూర్తంలో తన అఫిడవిట్‌ పత్రాలను సమర్పించారు.అయితే,ఈ నామినేషన్‌ ప్రక్రియలో మోడీ పేరును నలుగురు సామాన్యులు ప్రతిపాదించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.ఇందుకోసం భిన్న సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను ప్రధాని ఎంచుకున్నారు.
ఆ నలుగురు ఎవరంటే..?
పండిత్‌ గణేశ్వర్‌ శాస్త్రి:బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శాస్త్రి ప్రముఖ జ్యోతిష్యుడు.అయోధ్యలో కొత్తగా నిర్మించిన భవ్య మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించింది ఈయనే.
బైజ్‌నాథ్‌ పటేల్‌:వారణాసి లోక్‌సభ నియోజకవర్గా పరిధిలోని సేవాపురి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈయన.ఓబిసి వర్గానికి చెందిన పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త.సుదీర్ఘకాలంగా జన్‌సంఫ్‌ు,బిజెపితో కలిసి పనిచేస్తున్నారు.కుర్మీ పటేల్‌ వర్గానికి సేవాపురి,రోహానియాలో గట్టి పట్టు ఉంది. లాలనచంద్‌ కుశ్వాహా:ఈయన కూడా ఓబిసి వర్గానికి చెందిన వ్యక్తే.కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సిగ్రా ప్రాంతానికి చెందిన 65ఏళ్ల కుశ్వాహా సుదీర్ఘకాలంగా బిజెపి కేడర్‌లో ఉన్నారు.స్థానికంగా టెక్స్‌టైల్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు.
సంజయ్‌ సోంకర్‌: దళిత సామాజిక వర్గానికి చెందిన సంజయ్‌ సోంకర్‌..వారణాసి బిజెపి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.ఎస్‌సి కమ్యూనిటీలో ఈయనకు మంచి పలుకుబడి ఉంది.
తమ ప్రభుత్వంలో అన్నివర్గాల వారికీ సమ ప్రాధాన్యం కల్పిస్తామనే ఉద్దేశ్యాన్ని చాటిచెప్పేందుకే.. ప్రధాని ఇలా విభిన్న సామాజిక వర్గాలకు చెందిన వారిని ప్రతిపాదకులుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలోనూ ప్రధానిని నలుగురు భిన్న వృత్తులకు చెందిన వ్యక్తులు ప్రతిపాదించారు. వ్యవసాయ శాస్త్రవేత్త రమాకాంత్‌ శుక్లా, బిహెచ్‌యూ మహిళా మహా విద్యాలయ మాజీ ప్రిన్సిపల్‌ అన్నపూర్ణ శుక్లా, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త సుభాష్‌ గుప్తా, వారణాసి ఘాట్‌ వద్ద ప్రధాన కాటికాపరి జగదీశ్‌ ప్రకాశ్‌ చౌధరీ..నాడు మోడీ నామినేషన్‌పై ప్రతిపదాకులుగా సంతకాలు చేశారు.
ప్రతిపాదకులు అంటే..
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తిని కొందరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. వారు తప్పనిసరిగా అభ్యర్థి పోటీ చేస్తున్న అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో నమోదిత ఓటరు అయి ఉండాలి. నామినేషన్‌ పత్రాల్లో అభ్యర్థి సంతకంతో పాటు ప్రతిపాదకులు కూడా సంతకం చేయాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. గుర్తింపుపొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులకు ఒక ప్రతిపాదకుడు ఉండాలి. అదే గుర్తింపు లేని పార్టీలు లేదా స్వతంత్య్రులైతే 10మంది ప్రతిపాదించాలి. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామపత్రాలు దాఖలు చేయవచ్చు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !