బాహుబలం న్యూస్ మే10 హుజూరాబాద్
మండలంలోని ఇందిరానగర్ శాలపల్లె గ్రామ తాజా మాజీ సర్పంచ్ కోడిగూటి శారదా భర్త ప్రవీణ్ శుక్రవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సిపిఐ పార్టీలో చేరారు.హుజురాబాద్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆయనకు సిపిఐ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.గ్రామ సర్పం చ్ భర్తగా గ్రామంలో ప్రజల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసి,ఆడపిల్ల పుడితే 5వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేయడంతో పాటు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టా రు.అలాగే మొట్టమొదటగా రాష్ట్రంలోనే దళిత బంధు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి ఆధ్వర్యంలో గ్రామంలో పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రారం భించారు.తద్వారా ప్రతి ఇంటికి దళిత బంధు కార్యక్రమాన్ని అందేలా చొరవ తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత సేవ చేసేందుకే సిపిఐ లో చేరానని పేర్కొన్నారు.
