బిఅర్ఎస్,బీజేపీ పార్టీలను ఓడించండి,కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావునీ గెలిపించండి. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష్

బాహుబలంన్యూస్ మే09 హుజురాబాద్
విద్యార్థి,నిరుద్యోగులను విస్మరించిన బిఆర్ఎస్,బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరసంవత్సరాలు అధికారంలో ఉండివిద్యార్థి,నిరుద్యోగయువతనువిస్మరించిందని,2014,2018ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని బిఆర్ఎస్ పార్టీనీ,కెసిఆర్ నుఓడించడానికి విద్యార్థి,నిరుద్యోగులు సిద్దం కావాలని హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులను ఓడించి,కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావునీ గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష్, పిలుపునిచ్చారు.గురువారం రోజున హుజురాబాద్ నియోజకవ ర్గంలో ని16వ వార్డు మరియు కూరగాయల మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుని గెలిపించాలని సీపీఐ ఆధ్వర్యంలో ప్రచారం.నిర్వహించారు. అనంతరం రామారపు వెంకటేష్.మాట్లాడుతూ విద్యార్థి,ని రుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించి,తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న BJP,BRS పార్టీలను ఓడించాలని విద్యార్థి,నిరుద్యోగులత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో,కెసిఆర్ కుటుంబ అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు.బీజేపీపార్టీ,మత పరమైన ప్రచారం చేస్తుందని రాముడి పేరుతో రాజకీయ చేస్తుందని కరీంనగర్ కి బండి సంజయ్ ఈ పది సంవత్సరా లలో ఏంచేశారని ప్రశ్నోంచారు.మతపరమైన రాజకీయాలను ఓడించాలని.ప్రజాపాలన చేస్తు ప్రజలకు ఎప్పుడూ అందు బాటులో ఉంటు పేదలకు అన్నదాతలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులకు,పేదలకు అన్నదాత లకు,మంచి పాలనావస్తుందని అన్నారు.ప్రచారంలో సిపిఐ పట్టణ కార్యదర్శిముత్తరాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్,సీపీఐ నాయకులు అన్నే ఐలయ్య,కన్నే బోయిన మలయ్య,ఎల్లమ్మ,జల్లాగీతా ,రాజిత,వనిత,సాహెబ్ రాజు,మజిరరెడ్డి,మంజులరెడ్డి, శ్రీకాంత్,అఖిలరెడ్డి,బండ మమ్మి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !