తెలంగాణలో సంచలన విజయాల దిశగా దూసుకుపోతున్న బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉంటేనే ప్రగతి సాధ్యం మాజీ మంత్రి బిజెపి నేత ఇనుగాల పెద్దిరెడ్డి వెల్లడి

బాహుబలంన్యూస్ మే 9 హుజురాబాద్
కేంద్రంలో ముమ్మాటికి మళ్ళీ బిజెపి దే అధికారం జూన్ లో కేంద్రమంత్రిగా సంజయ్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని
మాజీ మంత్రి బిజెపి నేత ఇనుగాల పెద్దిరెడ్డి వెల్లడించారు ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అనూహ్యమైన… సంచలనమైన విజయాలను కైవసం చేసుకునే దిశగా ముందుకు దూసుకుపోతున్నదని… ఈ విషయంలో రెండవ అభిప్రాయానికి తావేలేదని మాజీ శాసనసభ్యులు… మాజీ మంత్రి… భారతీయ జనతా పార్టీ నాయకులు ఇనుగాల పెద్దరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం హుజురాబాద్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండడం కనిపిస్తుందని…. ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానిస్తున్నట్లుగానే దేశ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి రికార్డ్ స్థాయిలో 400 పార్లమెంటు స్థానాలు పార్టీ కూటమికి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పెద్దిరెడ్డి జోష్యం చెప్పారు. భారతదేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయ ని… మరి ముఖ్యంగా భారత్ తో పోటీ పడుతున్న అగ్రదేశాలు కూడా రేపటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వం అధికారంలోకి రావాలని అభిలషిస్తున్నట్లు పలు దేశాల పత్రికలు సంపాదకీయాలు రాస్తున్న విషయాన్ని పెద్దిరెడ్డి గుర్తు చేశారు, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం గత పది సంవత్సరాల కాలంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారై అగ్రదేశాల సరసన నిలదొక్కుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల పరిస్థితులను గమనించినట్లయితే డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నట్లయితే దేశంలో గానీ… రాష్ట్రాలు గాని శరవేగంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న విషయాన్ని ప్రజలు ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైందని ఆయన తెలిపారు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రేపటి ఎన్నికలలో అత్యధిక పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో కైవసం చేసుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నట్లు అర్థమవుతున్నదని… సర్వే నివేదికలు అంశాలను దృవీకరిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది భారతీయ జనతా పార్టీ ప్రతి పార్లమెంటు స్థానంలో వేగంగా పుంజుకుంటున్నరని చెప్పారు. ఒకవేళ అందరి అంచనాలను తలకిందులు స్థానాలను కైవసం చేసుకున్నట్లయితే రానున్న రోజులలో తెలంగాణాలో రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత వాతావరణం తెలియజేస్తున్నదని వివరించారు, భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో ఇకపై మంచి రోజులు రాబోతున్నాయని… తెలంగాణలో అధికారంలోకి రావడం ద్వారా దక్షిణ భారతదేశంలో బిజెపి అధికారికంగా అడుగుపెట్టే సమయం ఆసన్నమైందని పెద్దిరెడ్డి తెలిపారు.

మోడీ ప్రభుత్వంలో బండికి కీలక బాధ్యతలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా రెండవ పర్యాయం భారీ మెజారిటీతో బండి సంజయ్ ని గెలిపించుకున్నట్లయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల రూపురేఖలు రానున్న రోజులలో శరవేగంగా మారే అవకాశం ఉంటుందని… అలాగే బండి వల్ల తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి కుసుమాలు విరబూయడానికి ఆస్కారం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణలోని బిజేపీ నాయకులలో అందరికంటే ఎక్కువగా బండి సంజయ్ మీద అత్యధిక అభిమానం ఉన్నందున త్వరలో విస్తరించబోయే మోదీ మంత్రివర్గంలో సంజయ్ అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖను మోడీ అప్పగించే అవకాశం నూటికి నారు శాతం ఉందని ఆయన జోస్యం చెప్పారు. ఐదేళ్ల కోసం జరిగే ఎన్నికల విషయంలో ప్రజలు లోతుగా ఆలోచించి ఓటు వేసినట్లయితే మన ప్రాంతాలు… మన భవిష్యత్తు బాగుపడుతుందనే విషయాన్నీ గుర్తించి ఓటు హక్కు వినియోగించుకోవాలని… ప్రస్తుత ఎన్నికలలో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు కరీంనగర్ స్థానం నుండి పోటీ చేస్తున్నందున వారిలో మనకోసం మన ప్రాంతం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు ఎవరో ఎవరికి వారు సొంతంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత మీపై ఉందని పెద్దిరెడ్డి ప్రజలకు గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ నోట విన్న కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రతి గ్రామంలో బండి సంజయ్ పేరు మారు మోగుతున్నరని… ప్రతి ఓటరు ఆయనను బలపరిచి భారీ మెజారిటీతో విజయాన్ని కట్టబెట్టినట్లయితే రానున్న రోజులు మన భవిష్యత్తుకు ఉపయోగపడతాయని పెద్దిరెడ్డి కోరారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేసి ఈ ప్రాంతం నుండి ఆయనను పార్లమెంటుకు పంపించవలసిన అవసరం ఎంతైనా ఉండన్నారు. బిజెపి క్యాడర్ ఈ నాలుగైదు రోజుల సమయాన్ని క్షణం కూడా వృధా చేయకుండా రేయింబవళ్లు బండి సంజయ్ విజయం కోసం పనిచేయాలని…. మన శ్రమంతో ఇకపై మెజారిటీ రావడం కోసం వెచ్చించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేవలం నాలుగైదు నెల క్రితమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసానికి దూరమైందని… అసెంబ్లీ ఎన్నికల నందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క గ్యారెంటీని అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతికిల పడిపోయిందని పెద్దిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో… విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించి తమ జీవితాలలో వెలుగులు ప్రసరిస్తాయని మురిసిపోగా వారి ఆశలు ఆనతి కాలంలోనే భగ్నమైనట్లు పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాదిమంది వ్యవసాయ దారులు రుణమాఫీ కోసం. ఎదురుచూస్తుండగా వారి ఆశలను అడియాసలు చేస్తూ. రుణమాఫీ ఇప్పుడు చేయడానికి తమకు స్తోమత లేదని… వచ్చే ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామంటూ దేవుళ్ళ మీద… దేవాలయాల మీద రేవంత్ రెడ్డి ప్రమాణాలు వేస్తుండడాన్ని రైతులు నానారకాలుగా చెప్పుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ప్రమాణాలు చేసిన చరిత్ర లేనేలేదని… ఆ ఘనత సాధించిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల పరిస్థితి ఇలా ఉండగా… కౌలు రైతుల.. వ్యవసాయ కూచీల పరిస్థితి ఇంకెంత అగమ్య గోర గోచరంగా తయారైందో ఎవరికి వారు అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !