రేవంత్ ప్రభుత్వానికి త్వరలో కౌంట్ డౌన్ ప్రారంభం
బిజెపి వల్లనే తెలంగాణ సస్యశ్యామలం సాధ్యం
కరీంనగర్లో కమల వికాసాన్ని అడ్డుకునేది ఎవరు?
బాహుబలంన్యూస్/మే07హుజురాబాద్:;
తెలంగాణలో అధికారం చలాయిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిం దని ఆ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఇతర ఏ హామీ కూడా నెరవేర్చడం లేదని అందువల్ల ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ త్వరలో ప్రారంభమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయని జూన్ మూడవ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక రేవంత్ సర్కార్ రోజులు లెక్కపెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని గో రక్షణ సమితి తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హిందూ సమాజ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కాశెట్టి కుమార్ పై విధంగా వ్యాఖ్యానించారు. మంగళవారం హుజరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కాశెట్టి కుమార్ మాట్లాడుతూ కరీంనగర్లో ఆరు నూరైనా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు అయినటువంటి బండి సంజయ్ రెండవ పర్యాయం పార్లమెంటుకు ఎన్నికవ్వడం ఖాయం అయిపోయిందని చెప్పారు.కాకపోతే మెజారిటీ ఎంత వస్తుందని విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయని తెలిపారు తన అంచనా ప్రకారం సుమారుగా రెండున్నర లక్షల నుండి మూడు లక్షల మెజారిటీతో బండి సంజయ్ విజయకేతనాన్ని ఎగురవేయబోతున్నట్లు కుమార్ జోస్యం చెప్పారు. గత రెండు నెలల నుండి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 75% గ్రామాలలో తాను.తన అనుచరులు స్వయంగా పర్యటించి ఎన్నికల సర్వే చేసినట్లు ఆయన వివరించారు. ఈ పార్లమెంట్ పరిధిలో గల ఏడు అసెంబ్లీ స్థానాలలో దాదాపుగా 18 లక్షల ఓట్లు ఉండగా12 లక్షల ఓట్ల వరకు పోలయ్యే అవకాశం ఉండగా అందులో దాదాపు 8 లక్షల ఓట్ల వరకు బండి సంజయ్ పొందే అవకాశం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చొప్పదండి. వేములవాడ.సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాద్.హూజురాబాద్,మానకొండూర్ తదితర 7 నియోజకవర్గా లు ఉండగా,ఈ ఏడింటిలో కనీసం ఐదు అసెంబ్లీ స్థానాలలో బండి సంజయ్ కి మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని తాము జరిపిన సర్వేలో వెల్లడైనట్లు కాశెట్టి కుమార్ వెల్లడించారు. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా తాము జరిపిన సర్వేలో ఇప్పటివరకు పది స్థానాలలో బిజెపి విజయకేతనం ఎగురవేయబోతున్నదని… పరిస్థితి రోజురోజుకు బిజెపికి అనుకూలంగా తయారవుతున్న పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే ఆ పార్టీకి 12 స్థానాల వరకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు స్పష్టమవుతుందని చెప్పారు. ఇదే నిజమైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో కాలం అధికారంలో ఉండటం అసాధ్యమన్నారు. దీనికి కారణం బిజెపికి మెజారిటీ పార్లమెంటు స్థానాలలో విజయ అవకాశాలు లభించినట్లయితే పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టో భగవద్గీత లాంటిదని ఊరూరా చాటారని.ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయక నేడు గుళ్ళు గోపురాల మీద ప్రమాణాలు చేస్తుండడం సిగ్గుచేటుగా ఉందని ఆయన దుయ్యబట్టారు.
కేంద్రంలో బిజెపికి 400 సీట్లు రావడం ఖాయం
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలలో ప్రపంచం విస్తు పోయేలా… అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 400 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం మెండుగా ఉందని… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి దేశపగ్గాలు చేబట్టబోతున్నారని కాశెట్టి కుమార్ వెల్లడించారు. భారతదేశ ఎన్నికల గురించి యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని… దాదాపు ప్రతి దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న విషయాన్ని కుమార్ గుర్తు చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో రానున్న దశాబ్దంలో భారత్ సూపర్ పవర్ గా తయారవుతుందని అలాగే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా కరీంనగర్లో బండి సంజయ్ భారీ మెజారిటీతో విజయం సాధించినట్లయితే కేంద్రంలో ఆయనకు మంచి మంత్రిత్వ శాఖను ప్రధాని నరేంద్ర మోడీ కట్టబెట్టి అవకాశం మెండుగా ఉందని… తద్వారా తెలంగాణ ప్రాంతమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా విశేషంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేధావులు యువకులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారు భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచి మంచి మెజారిటీతో బండి సంజయ్ ని రేపటి ఎన్నికలలో గెలిపించి తీరాలని కాశెట్టి కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.










