బాహుబలం న్యూస్ హుజూరాబాద్
దళిత బహుజనులు 70% కాంగ్రెస్ వైపే తెలంగాణ లోని ప్రజలు గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పరిపాలనను తెలంగాణ రాష్ట్రంలో కోరుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సబ్బండ వర్గాల ప్రజలు భారతదేశంలోని వివిధ పార్టీలు ప్రజలు, సంఘాల నాయకులు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు మనుగడ ఉండదని అంతేకాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నది మొన్న మణుపూర్ సంఘటన నిన్నటి రోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని పలుమార్లు ప్రజాప్రతినిధులు మాట్లాడడం చాలా బాధాకరం 10 సంవత్సరాలు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నది అప్పుడు భారత రాజ్యాంగం ఎక్కడ అడ్డు వచ్చిందని మేము సూటిగా అడుగుతున్నాము .బిజెపి ప్రభుత్వం గతంలో ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే ప్రైవేటీకరణ చేయడం భారతదేశంలో ప్రైవేటు వ్యక్తులకు పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్నది. సామాన్య ప్రజలకు ఏమి చేయలేదు నిత్యవసర సరుకుల ధరలు పెరగడం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం తప్ప ఏమిచేయలేదు.ప్రతి సామాన్య వ్యక్తికి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పడం ,నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పడం. నోట్ల రద్దు అంతే కాకుండా రైతులు గత సంవత్సరం పాటు రైతు సమస్యల పైన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఎండ వాన చలి లెక్కచేయకుండా సంవత్సరం పాటు నిరసన కార్యక్రమం చేశారు. రైతు చట్టాలకు వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈరోజు వరకు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి గెలిచాల రాజేందర్ రావును భారిమెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు తునికి సమ్మయ్య ,పొన్నాల వినోద్ కుమార్, గంగారపు రవి, గిరిమళ్ళ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.