ఆర్టీసి లో ఉచిత ప్రయాణం ఇస్తే బస్సుల్లో మహిళలు శిఖలు,పట్టుకుంటున్నరనీ మహిళలను అవమాన పరుస్తున్న కేసీఆర్.. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ ..
హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ మండల కేంద్రంలోనీ సూపర్ బజార్ చౌరస్తా లో అది వారం రోజున
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని మహిళ లకు ఆర్టీసి లో ఉచిత ప్రయాణం అందిస్తు న్నామని ఆర్టీసి లో ఉచిత ప్రయాణం ఇస్తే బస్సుల్లో మహిళలు శిఖలు, పట్టుకుంటున్న రని కేసీఆర్ అంటున్నారనిమహిళలను కేసీఆర్ అవమానపరుస్తున్నారని అన్నారు.
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం కేసీఆర్ కి ఇష్టం లేదు.కేటీఆర్ మహిళలకు ఆర్టీసి లో ఉచిత ప్రయాణం చేయడం మీకు ఇష్టం లేదా .? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఇవ్వని రేషన్ కార్డులను మా ప్రభుత్వం ఎన్నికలు పూర్తికాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గ ఇన్చా ర్జి ప్రణవ్ దగ్గర ఉన్నాయి.ఎన్నికలు పూర్తి కాగానే ఇస్తాం అని అన్నారు 10 ఏళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.. ఎన్నిక లు పూర్తికాగానే కొత్త పెన్షన్లు ఇస్తామని ఇప్పుడున్న పెన్షన్లు 4000 రూపాయలకు పెంచుతాం.ఉద్యోగ సంఘాల ,జర్నలిస్ట్ ల ,కుల సంఘాల జేఏసి పెట్టుకొని సకలజనుల తెలంగాణ కోసం కొట్లడితే..అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కొట్లాడితే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే సమయంలో లేని కేసీఆర్ డిల్లి వెళ్లి తెలంగా ణ కోసం కొట్లడినా అని చెబుతున్నాడు..

సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చినం..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు.మేము ఇచ్చిన కార్యక్రమాలు అన్నీ అమలు చేస్తాం.
బీజేపీ బిఆర్ఎస్ లకు ఓటు వేసి వృదా చేసుకోవద్దు.రాజేందర్ రావు చదువుకున్న వ్యక్తి.మాకు ఎంపి తోడైతే మరింత అభివృద్ధి సాధించవచ్చు.గుళ్ళో దేవుడు ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి.బండి సంజయ్ రాముడు ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు..
10 ఏళ్లలో బీజేపీ ఏం చేసింది.. 5 ఏళ్లలో ఎంపిగా ఉండి నియోజకవర్గానికి ఏం చేశావు. నేను ఎంపిగా ఉన్నప్పుడు మోడల్ స్కూల్ తెచ్చిన,కస్తూర్బా పాఠశాల తెచ్చిన హుజురాబాద్ మున్సిపాలిటీ చేసినం
అనేక రకాలుగా అభివృద్ధి చేసినం బండి సంజయ్ నాన్న లాగ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ గా చేయలేదు .రాజేందర్ రావు చదువుకున్న వ్యక్తి.వాళ్ల నాన్న ఎమ్మెల్యే గా చేశారు.
కరీంనగర్ కి చేసిన అభివృద్ధి చెప్పు..
రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జిల్లా మంత్రిగా మాకు ఎంపి ఇస్తే మరింత అభివృద్ధి చేస్తా..గతంలో ఎంపిగా చేసిన అనుభవం వుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నేల 13 వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు కు ఓటు వేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మంత్రి పున్నం ప్రభాకర్ అన్నారు

పార్లమెంటు అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ , మాట్లాడుతూ మే 13 న జరిగే ఎన్నికలు చాలా ముఖ్యమైనవి..
మన భవిష్యత్ ను నిర్ణయించేవి..రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నీ చేసే ఎన్నికలు.
న్యాయానికి.అన్యాయానికి జరిగే ఎన్నికలు.అని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు.
2014 నుండి బీజేపీ మోసం చేస్తూ వస్తుందని,నిరుద్యోగం పెరిగింది.. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు.. నిత్యవసర వస్తువుల ధరలు పెంచారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్. అని అన్నారు.రాజీవ్ ఆరోగ్య శ్రీ,ఫీజు రీయింబర్స్మెంట్,108 అంబులెన్స్ ,104 ఇలా ఎన్నో పథకాలు అమలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అని ప్రణవ్ అన్నారు
ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు..
ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం.500 కి గ్యాస్ అందిస్తున్నాం.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం..
ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం.రైతులకు ఆగస్టు 15 లో 2 లక్షల రుణమాఫీ చేస్తాం..బీజేపీ సోషల్ మీడియాలో తప్ప ఏం చేసింది.బండి సంజయ్ 5 ఏళ్లు ఏం చేశారు..రాముడి ఫోటో పెట్టీ,అక్షింతలు పంచుతూ ఓట్లు అడుగుతున్నారు.మోడీ ఫోటోలు పెట్టుకుంటలేరు..రాముడి ఫోటో తో ఓట్లు అడుగుతున్నారు.భద్రాచలం తరువాత ఇల్లంతకుంట రామాయలం పెద్దది..ఏమైనా నిధులు ఇచ్చారా.వేములవాడ రాజన్న ఆలయం,కొడగట్టు ఆలయాలకు ఏమైనా నిధులు ఇచ్చారా…? బిఆర్ఎస్ పని అయిపోయింది కారు షెడ్డూకు పోయింది..
బీజేపీ బిఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నారు..
మొన్నటి ఎన్నికల్లో బి ఆర్ఎస్ కి బీజేపీ..ఇప్పుడు బీజేపీ కి బి ఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చారా..? యువత కి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ..కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 25 వేల ఉద్యోగాలు ఇచ్చాం.మరి ఇక్కడి ఎమ్మెల్యే ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా మని సెంటిమెంట్ తో ఓట్లు అడిగారు..
పొన్నం ప్రభాకర్ ఎంపిగా ఇల్లంతకుంట రాముల వారి గుడికి విద్యుత్ లైన్ తెచ్చారు,పాస్ పోర్ట్ ఆఫీస్, మోడల్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయం తెచ్చారు అని అన్నారు.చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు ని గెలిపించండి.బై బై బండి.. బై బై మోడీ అని
అన్నారు. ఈ కార్నర్ మీటింగ్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు, యేముల పుష్పలత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు
సొల్లు బాబు, వివిధ వార్డుల అధ్యక్షులు
సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !