బండి సంజయ్ బహిరంగ సభను విజయవంతం చేయండి. బీజేపీ హుజురాబాద్ నియోజక వర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి .

బాహుబలం న్యూస్ మే 02 హుజూరాబాద్..
రేపు సాయంత్రం 4-00 గంటలకు హుజురాబాద్ పట్టణంలోని బృందావనం చౌరస్తాలో (అంబేద్కర్ చౌక్ దగ్గర) జరిగే బిజెపి సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ రావడం జరుగుతుందని కావున కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నియోజక వర్గ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి పిలుపు నిచ్చారు.గత పది సంవత్సరాల కాలంలో కేంద్రం లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాల ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు పూర్తిగా అండగా నిలబడిందని కొనియాడారు. మూడోసారి నరేంద్రమోడీ దేశ ప్రధాని అయితే భారతదేశాన్ని ప్రపంచం లో మూడవ ఆర్థిక దేశంగా తయారు చేస్తాడని దాని కోసం ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ కి మద్దతుగా నిలవాలని గౌతమ్ రెడ్డి కోరారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఏనాడు పార్లమెంట్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని గౌతమ్ రెడ్డి దుయ్యబట్టారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గత ఐదు సంవత్సరాలలో 12వేల కోట్ల రూపాయలు కేంద్రంనుండి నిధులు తీసుకువచ్చాడని గుర్తుచేసాడు 2వ సారి పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి చేస్తాడని తెలిపారు.బండి సంజయ్ కుమార్ కు మద్దతుగా రేపు హుజురాబాద్ నియోజకవర్గంలోని యువత, మేధావులు బిజెపి కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాడ గౌతమ్ రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !