హుజరాబాద్ లో అక్రమ రియల్ దందాపై …. సీఎంకు, తుమ్మేటి ఫిర్యాదు….

బాహు బలం న్యూస్ హుజూరాబాద్:హుజురాబాద్, జమ్మికుంట పట్టణ శివార్లలో గత కొద్ది కాలంగా జరుగుతున్న భూ ఆక్రమణలు అక్రమ భూ దందాలు, అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం పై సీనియర్ కాంగ్రెస్ నేత జమ్మికుంట వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, సీఎం ఏ రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంటకు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో తుమ్మేటి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అక్రమ రియల్ ఎస్టేట్ దందాపై సమగ్రంగా వినతి పత్రం సమర్పించారు. హుజురాబాద్ పట్టణంలో కరీంనగర్ వరంగల్ రహదారి పక్కన దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో కొందరు ప్రముఖులు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బోర్నపల్లి రంగాపూర్ వద్ద అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారని, ఇందులో మున్సిపాలిటీకి రావాల్సిన భూమి ఇవ్వలేదని, వెంచర్లలో మౌలిక సదు- పాయాలు కల్పించలేదని పేర్కొన్నారు. అక్రమ రియల్ వ్యాపారానికి సబ్ రిజిస్ట్రార్ సహకరిస్తున్నారని ఈ విషయమై సమగ్ర విచారణ చేసి ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అక్రమ రియల్ వ్యాపారం పై భూ ఆక్రమణలపై అసైన్డ్ భూముల కొను గోలు పై తుమ్మేటి సమ్మిరెడ్డి సీఎం రేవంత్ ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించే సీఎం కు చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు ఏం తీసుకుంటారో
వేసి చూడాల్సిందే.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !